Breaking News

చరిత్ర సృష్టించిన ఆసీస్‌ ఓపెనర్‌.. 13 ఏళ్ల రికార్డు బద్దలు

Published on Sat, 09/14/2024 - 14:25

కార్డిప్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ ప‌రాజ‌యం పాలైన‌ప్ప‌ట‌కి.. ఆ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్, ఓపెనర్‌ మాథ్యూ షార్ట్ మాత్రం చ‌రిత్ర సృష్టించాడు. బ్యాటింగ్‌లో 28 పరుగులతో పర్వాలేదన్పించిన షార్ట్‌.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటాడు. 

ఈ మ్యాచ్‌లో పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన షార్ట్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ఔరా అన్పించాడు. 3 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన షార్ట్‌.. కేవ‌లం 22 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. దీంతో ప‌లు అరుదైన రికార్డులను షార్ట్ త‌న పేరిట లిఖించుకున్నాడు. 

షార్ట్‌ సాధించిన రికార్డులు ఇవే..?
టీ20ల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా త‌ర‌పున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు న‌మోదు చేసిన ప్లేయ‌ర్‌గా షార్ట్ రికార్డుల‌లెక్కాడు. ఇప్ప‌టివ‌ర‌కు  ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గ‌జం షేన్ వాట్స‌న్ పేరిట ఉండేది. 2011లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఓ టీ20 మ్యాచ్‌లో వాట్స‌న్ 15 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజా మ్యాచ్‌లో 5 వికెట్ల ఘ‌న‌త సాధించిన షార్ట్‌.. 13 ఏళ్ల వాట్స‌న్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. 

అదే విధంగా ఓవరాల్‌గా ఇంగ్లండ్‌పై టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా షార్ట్‌ నిలిచాడు. ఈ జాబితాలో భారత స్పిన్నర్‌ చాహల్‌ తొలి స్దానంలో ఉన్నాడు. 2017లో చాహల్‌ ఇంగ్లండ్‌పై ఏకంగా 6 వికెట్లు సాధించాడు.

ఓడిపోయిన మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణంకాలు నమోదు చేసిన బౌలర్‌గా బంగ్లాపేసర్‌ ముస్తిఫిజుర్‌ రెహ్మన్‌ సరసన షార్ట్‌ నిలిచాడు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)