Breaking News

సౌతాఫ్రికా ఆటగాడి స‌రి కొత్త చ‌రిత్ర‌.. ప్ర‌పంచంలో ఒకే ఒక్క‌డు

Published on Thu, 09/04/2025 - 21:39

అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో సౌతాఫ్రికా యువ ఆట‌గాడు మాథ్యూ బ్రీట్జ్కే (Matthew Breetzke) త‌న అద్బుత ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో బ్రీట్జ్కే మ‌రోసారి దుమ్ములేపాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ప్రోటీస్‌ను మార్‌క్ర‌మ్‌తో క‌లిసి ఈ యువ ఆట‌గాడు ఆదుకున్నాడు. కేవ‌లం 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 85 ప‌రుగులు చేశాడు.

ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ఇక ఈ మ్యాచ్‌లో సూప‌ర్ హాఫ్ సెంచ‌రీతో మెరిసిన బ్రీట్జ్కే ప్రపంచ రికార్డును సాధించాడు. వన్డేల్లో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలో 50 ప్లస్‌ స్కోర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు వన్డేల్లో ఏ క్రికెటర్‌ కూడా ఈ ఫీట్‌ సాధించలేకపోయారు.

పాకిస్తాన్‌ వేదికగా జరిగిన ట్రై సిరీస్‌లో కివీస్‌ జట్టుతో మ్యాచ్‌లో వన్డే అరంగేట్రం చేసిన .. 148 బంతుల్లోనే 150 పరుగులు సాధించాడు. తద్వారా వన్డే అరంగేట్రంలోనే అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అనంతరం పాకిస్తాన్‌తో వన్డేలో 83 పరుగులు చేశాడు బ్రీట్జ్కే. 

తాజాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 57 పరుగులు సాధించిన బ్రీట్జ్కే.. రెండో వన్డేలో 88 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో 88 పరుగులు చేశాడు. మొత్తంగా ఇప్పటివరకు తను ఆడిన ఐదు వన్డేల్లో 463 పరుగులు చేశాడు. 

తద్వారా తొలి ఐదు వన్డే ఇన్నింగ్స్‌లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ ఆటగాడు టామ్ కూపర్‌(374) పేరిట ఉండేది. తాజా ‍మ్యాచ్‌తో కూపర్ రికార్డును మాథ్యూ బ్రేక్ చేశాడు.

 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)