Breaking News

డబ్ల్యూటీసీ ఫైనల్లో ఐపీఎల్‌ అంపైర్‌లు.. ఎవరంటే?

Published on Mon, 05/29/2023 - 17:00

ఇంగ్లండ్‌ వేదికగా జరగనున్న వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో టీమిండియా- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. జూన్‌ 7న లండన్‌లోని ఓవల్‌ స్టేడియంలో ఈ ప్రతిష్టాత్మక టెస్టు మ్యాచ్‌ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సంబంధించిన మ్యాచ్‌ అఫీషియల్స్‌ (అంపైర్లు, రిఫరి) జాబితాను ఐసీసీ సోమవారం ప్రకటించింది. 

ఆన్-ఫీల్డ్ అంపైర్లతో సహా ఐదుగురు మ్యాచ్ అఫీషియల్స్‌ పేర్లను ఐసీసీ వెల్లడించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లండ్‌ అంపైర్‌ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికయ్యారు. అదేవిధంగా థర్డ్‌ అంపైర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో వ్యవహరించనున్నాడు. 

ఇక ఫోర్త్‌ అంపైర్‌గా శ్రీలంకకు చెందిన సీనియర్‌ అంపైర్‌ కుమార్ ధర్మసేన బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అదే విధంగా మ్యాచ్‌ రిఫరీగా వెస్టిండీస్‌ క్రికెట్‌ దిగ్గజం రిచీ రిచర్డ్‌సన్ వ్యవహరించునున్నాడు. కాగా క్రిస్ గఫానీ, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లు ఐపీఎల్‌-2023లో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌లుగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇప్పడు ఇదే అంపైర్‌లు డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా ఫీల్డ్‌అంపైర్‌లగా ఎంపిక కావడం గమానార్హం. ఇక ఇప్పటికే లండన్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్‌ ఫైనల్‌ ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు పయనం కానున్నారు. ఈ జాబితాలో షమీ, జడేజా, గిల్‌ వంటి స్టార్‌ క్రికెటర్లు ఉన్నారు.
చదవండి: IPL 2023: ధోని అంటే ఇంత అభిమానమా? రాత్రంతా రోడ్లపై పడుకుని! వీడియో వైరల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)