Breaking News

ICC: టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం

Published on Tue, 06/18/2024 - 12:36

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం రేగింది. ఓ మాజీ క్రికెటర్‌ తనకు పదే పదే ఫోన్లు చేస్తూ.. అవినీతికి పాల్పడాల్సిందిగా కోరుతున్నాడంటూ ఉగాండా ప్లేయర్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మండలికి ఫిర్యాదు చేశాడు.

తనను ఫిక్సింగ్‌కు ఉసిగొల్పేలా వ్యవహరించినట్లు సదరు క్రికెటర్‌ పేర్కొన్నట్లు ఐసీసీ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి. కాగా అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి ఉగాండా తొలిసారి అర్హత సాధించింది.

వెస్టిండీస్‌, అఫ్గనిస్తాన్‌, న్యూజిలాండ్‌, పపువా న్యూగినియాలతో కలిసి గ్రూప్‌-సిలో ఉన్న ఉగాండా.. లీగ్‌ దశలో నాలుగింట కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌ గెలిచింది. పపువా న్యూగినియాపై గెలుపొంది ప్రపంచకప్‌ టోర్నీలో బోణీ కొట్టింది.

ఇదిలా ఉంటే.. గయానాలో మ్యాచ్‌ సందర్భంగా తనకు బుకీల నుంచి ఫోన్‌కాల్‌ వచ్చినట్లు ఓ ఉగాండా ప్లేయర్‌ ఐసీసీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కెన్యాకు చెందిన మాజీ క్రికెటర్‌ వివిధ ఫోన్‌ నంబర్ల నుంచి పదే పదే కాల్‌ చేశాడని.. సదరు ప్లేయర్‌ ఐసీసీ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ)కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇందుకు సంబంధించి ఐసీసీ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘పెద్ద జట్లతో పోలిస్తే ఉగాండా వంటి అసోసియేట్‌ దేశాలకు సంబంధించిన ఆటగాళ్లను టార్గెట్‌ చేయటమే సులువని భావిస్తారు బుకీలు. వారిని ఈజీగా ట్రాప్‌ చేయొచ్చనే ఉద్దేశంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారు.

అయితే, సదరు ప్లేయర్‌ ముందుగానే ఐసీసీ దృష్టికి ఈ విషయం తీసుకురావడం మంచిదైంది. వరల్డ్‌కప్‌ వంటి మెగా ఈవెంట్లలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

కాబట్టి ఐసీసీ ఏసీయూ అధికారులు తప్పకుండా ఓ కన్నేసే ఉంచుతారు. క్రికెట్‌కు మచ్చతెచ్చేలా వ్యవహరించే ఏ ఒక్కరిని ఐసీసీ ఉపేక్షించదు. ఈ ఘటనపై ప్రొటోకాల్‌ ప్రకారం.. దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నాయి. కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం తమకు ఇలాంటి కాల్స్‌ వస్తే ఆటగాళ్లు మండలి దృష్టికి తీసుకురావాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయి.

 కాగా టీ20 ప్రపంచకప్‌-8లో ఇప్పటికే సూపర్‌-8 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్‌-1లో టీమిండియా, అఫ్గనిస్తాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌... గ్రూప్‌-2లో ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్‌ ఉన్నాయి. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)