Breaking News

IPL 2025: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్‌..

Published on Fri, 02/21/2025 - 15:40

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు శుభ‌వార్త అందింది. కాలి మ‌డ‌మ గాయంతో బాధ‌ప‌డుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్‌, ఎస్ఆర్‌హెచ్ సార‌థి ప్యాట్ కమ్మిన్స్(Pat Cummins).. ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్ ఆరంభస‌మ‌యానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ గాయం కార‌ణంగానే కీల‌క‌మైన ఛాంపియ‌న్స్ ట్రోఫీకి సైతం క‌మ్మిన్స్ దూర‌మ‌య్యాడు. అయితే  త్వ‌ర‌లోనే త‌న ప్రాక్టీస్‌ను మొద‌లు పెట్ట‌నున్న‌ట్లు క్రికెట్  ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌మ్మిన్స్ స్ప‌ష్టం చేశాడు.

"చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నాను. ఇదేమి మరీ అంత పెద్ద గాయ‌మేమి కాదు.  నా గాయం గురించి బ‌య‌ట వినిపిస్తున్న వార్త‌లు ఏవీ నిజం కాదు. పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌డానికి ఆరు వారాల స‌మ‌యం అవ‌స‌రం లేదు. ఈ గాయం నుంచి కోలుకోవ‌డానికి కాస్త విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. 

ఈ క్ర‌మంలోనే ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాను. త్వ‌ర‌లోనే బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొద‌లు పెడ‌తాను. ఐపీఎల్ స‌మ‌యానికి సిద్దంగా ఉంటాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, తర్వాత జరిగే టెస్ట్ మ్యాచ్ లకు ఐపీఎల్‌ చాలా మంచి సన్నాహకంగా ఉంటుంది అని కమ్మిన్స్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ముగిసిన వెంటనే ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాతో వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనుంది. ఈ డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరు లార్డ్స్‌ వేదికగా జూన్‌ 11 నుంచి ప్రారంభం కానుంది.

తొలి సీజన్‌లోనే అదుర్స్‌..
కాగా  ఐపీఎల్‌-2024 మినీ వేలంలో క‌మ్మిన్స్‌ను రూ. 20.5 కోట్ల భారీ ధ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ కొనుగోలు చేసింది. త‌న ధ‌ర‌కు త‌గ్గ న్యాయం క‌మ్మిన్స్ చేశాడు. గతేడాది సీజన్‌లో అత‌డి సారథ్యంలోని ఎస్‌ఆర్‌హెచ్ రన్నరప్‌గా నిలిచింది. కమ్మిన్స్ బ్యాటింగ్‌, బౌలింగ్ పరంగా రాణించాడు.

దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు, ఫ్రాంచైజీ కమ్మిన్స్‌ను రూ.18 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ రిటైన్‌ చేసుకుంది. ఇక ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. సన్‌రైజర్స్‌​ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 23న హైదరబాద్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది.

ఐపీఎల్‌-2025కు ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు: పాట్ కమిన్స్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైదే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఎషాన్ మలింగ, సచిన్ బేబీ
చదవండి: గిల్‌ సెంచరీ కోసం​ హాఫ్‌ సెంచరీని త్యాగం చేసిన రాహుల్‌.. అదే హార్దిక్‌ అయ్యుంటే..!
 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)