Breaking News

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన మార్క్‌ చాప్‌మన్‌, షాహీన్‌ అఫ్రిది

Published on Thu, 04/25/2024 - 16:48

ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌ను ఇవాళ (ఏప్రిల్‌ 23) విడుదల చేసింది. ఆటగాళ్లంతా ఐపీఎల్‌తో బిజీగా ఉండటంతో ర్యాంకింగ్స్‌లో చెప్పుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. జట్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా మూడు ఫార్మాట్లలో టాప్‌లో కొనసాగుతుంది.

వ్యక్తిగత ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. న్యూజిలాండ్‌ ఆటగాడు మార్క్‌ చాప్‌మన్‌, షాహీన్‌ అఫ్రిది, ఐష్‌ సోధి, టిమ్‌ సీఫర్ట్‌ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. పాకి​స్తాన్‌తో ఇటీవల జరిగిన టీ20లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన చాప్‌మన్‌ 12 స్థానాలు మెరుగుపర్చుకుని 33వ స్థానానికి ఎగబాకగా.. కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో (టీ20) 3 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అఫ్రిది రెండు స్థానాలు మెరుగపర్చుకుని 17వ స్థానానికి చేరుకున్నాడు. 

కివీస్‌ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ టిమ్‌ సీఫర్ట్‌ 27వ స్థానం నుంచి 24కు.. సోధి 23 స్థానం నుంచి 18వ స్థానానికి ఎగబాకాడు. తాజా ర్యాంకింగ్స్‌లో నేపాల్‌ ఆటగాడు దీపేంద్ర సింగ్‌ ఎయిరీ తొలిసారి టాప్‌-50 బ్యాటర్స్‌ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. తద్వారా నేపాల్‌ తరఫున టాప్‌-50లో చోటు దక్కించుకున్న నాలుగో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఏసీసీ ప్రీమియర్‌ కప్‌లో హాంగ్‌కాంగ్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన కారణంగా ఎయిరీ ర్యాంకింగ్స్‌లో మార్పు వచ్చింది.

ఇవి కాకుండా తాజా ర్యాంకింగ్స్‌లో చెపుకోదగ్గ మార్పులేమీ జరగలేదు. పురుషుల టెస్ట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌, వన్డే బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో బాబర్‌ ఆజమ్‌, టీ20 బ్యాటర్స్‌ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌లో కొనసాగుతున్నారు. 

టెస్ట్‌ బౌలర్స్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. అశ్విన్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో కేశవ్‌ మహారాజ్‌, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఆదిల్‌ రషీద్‌ టాప్‌లో కొనసాగుతున్నారు.  

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)