Breaking News

సిలిచ్‌ కొత్త చరిత్ర... 777వ ర్యాంక్‌తో బరిలోకి దిగి ఏటీపీ సింగిల్స్‌ టైటిల్‌ సొంతం

Published on Wed, 09/25/2024 - 03:59

హాంగ్జౌ (చైనా): క్రొయేషియా టెన్నిస్‌ ప్లేయర్‌ మారిన్‌ సిలిచ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌  ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) టూర్‌ చరిత్రలో కొత్త ఘనతను నమోదు చేశాడు. ఏటీపీ టైటిల్‌ నెగ్గిన  అతి తక్కువ ర్యాంకింగ్‌ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. మంగళవారం ముగిసిన  హాంగ్జౌ ఓపెన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సిలిచ్‌ విజేతగా నిలిచాడు. 

ఫైనల్లో అతను 7–6 (7/5), 7–6 (7/5)తో చైనాకు చెందిన జాంగ్‌ జిజెన్‌ను ఓడించి తన కెరీర్‌లో 21వ టైటిల్‌ గెలుచుకున్నాడు. హౌంగ్జౌ ఓపెన్‌లో బరిలోకి దిగే సమయానికి సిలిచ్‌ ఏటీపీ ర్యాంక్‌ 777 కావడం విశేషం. 35 ఏళ్ల సిలిచ్‌కు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా ఇక్కడ ఆడే అవకాశం  లభించింది. 

ఒకప్పుడు పురుషుల సింగిల్స్‌లో మంచి విజయాలతో టాప్‌ ఆటగాళ్లలో ఒకడిగా సిలిచ్‌ కొనసాగాడు. 2014లో తన ఏకైక గ్రాండ్‌స్లామ్‌ (యూఎస్‌ ఓపెన్‌) నెగ్గిన అతను ఆ్రస్టేలియన్‌ ఓపెన్, వింబుల్డన్‌లలో రన్నరప్‌గా నిలిచాడు. 2018లో అతను వరల్డ్‌  నంబర్‌వన్‌ ర్యాంకును కూడా అందుకున్నాడు. గత కొంత కాలంగా గాయాలతో అతను చాలా వరకు ఆటకు దూరమయ్యాడు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)