Breaking News

మాక్స్‌వెల్ రాజీనామా.. ఆ జ‌ట్టు కెప్టెన్‌గా మార్క‌స్ స్టోయినిస్‌

Published on Wed, 12/11/2024 - 10:06

బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజ‌న్‌కు ముందు మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఫ్రాంచైజీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ జ‌ట్టు ఫుల్ టైమ్‌  కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్ మార్కస్ స్టోయినిస్‌ని నియ‌మించింది. గ్లెన్ మాక్స్‌వెల్ వారుసుడిగా స్టోయినిష్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నాడు. 

జాన్‌ హేస్టింగ్స్‌ రిటైర్మెంట్‌ తర్వాత బీబీఎల్‌ సీజన్ 8 సంద‌ర్భంగా మెల్‌బోర్న్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మాక్సీ.. గ‌త సీజ‌న్ అనంత‌రం సారథ్య బాధ్య‌త‌లు నుంచి త‌ప్పుకున్నాడు.  గత సీజన్‌లో స్టార్స్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది.

10 మ్యాచ్‌లు ఆడిన మెల్‌బోర్న్‌ కేవలం 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఈ క్రమంలోనే మాక్స్‌వెల్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. కాగా స్టోయినిస్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉంది. గత సీజన్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో మాక్సీ గైర్హాజరీలో మెల్‌బోర్న్ స్టా‍ర్స్‌ కెప్టెన్‌గా మార్కస్‌ వ్యవహరించాడు. ఇక కెప్టెన్‌గా ఎంపికైన అనంతరం స్టోయినిష్‌ స్పందించాడు.

"గ‌త సీజ‌న్‌లో 'మ్యాక్సీ' లేకపోవడంతో కొన్ని మ్యాచ్‌ల్లో మెల్‌బోర్న్‌ సారథిగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ద‌క్కింది. కెప్టెన్సీని ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఎంపిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు ద‌క్కిన గౌర‌వంగా భావిస్తున్నాను. 

గ‌త ప‌దేళ్ల‌గా మెల్‌బోర్న్ స్టార్స్ ఫ్యామిలీలో భాగంగా ఉన్నాను. ఈసారి నాయకుడిగా మా జట్టును విజయఫథంలో నడిపించేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తాను" అని స్టోయినిస్‌ పేర్కొన్నాడు. మెల్‌బోర్న్ స్టార్స్ తరపున 98 మ్యాచ్‌లు ఆడిన స్టోయినిష్‌.. 2656 పరుగులు చేశాడు.

బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టోయినిస్‌ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. తొలి స్ధానంలో గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నాడు. ఇ​క బిగ్ బాష్ లీగ్ 14వ సీజన్ డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: SA vs PAK: డేవిడ్ మిల్లర్ ఊచకోత.. ఉత్కంఠ పోరులో ఓడిన పాకిస్తాన్‌

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)