Breaking News

ఖేల్‌రత్న వివాదం: తొలిసారి స్పందించిన మనూ భాకర్‌

Published on Tue, 12/24/2024 - 17:03

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు నామినీ జాబితాలో పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్‌, భారత షూటర్ మను భాకర్‌(Manu Bhaker)కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వేదికపై దేశ పతాకాన్ని రెపరెపలాడించిన మనును ప్రతిష్టాత్మక ఖేల్ రత్న(Major Dhyan Chand Khel Ratna) అవార్డుకు నామినెట్ చేయకపోవడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఈ క్రమంలో నామినీల జాబితాలో మను పేరు లేకపోవడంపై ఆమె  రామ్ కిషన్ భాకర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెను షూటర్ కాకుండా, క్రికెటర్‌ను చేసి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. అదేవిధంగా తన పేరు లేకపోవడంతో మను కూడా బాధపడిందని కిషన్ భాకర్ వ్యాఖ్యనించారు. 

తాజాగా ఈ విషయంపై మను భాకర్‌ తొలిసారి స్పందించారు. అవార్డుల కంటే దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడమే తన లక్ష్యమని మను చెప్పకొచ్చారు. "అవార్డుల గురుంచి నేను ఎప్పుడూ ఆలోచించను. ఒక అథ్లెట్‌గా దేశం తరపున ఆడి మరిన్ని పతకాలు తీసుకు రావడమే నా లక్ష్యం.

ద‌యచేసి ఈ విష‌యాన్ని ఇక్క‌డితో వ‌దిలేయండి. అన‌వ‌స‌రమైన ఊహాగానాలు ప్ర‌చారం చేయవద్దు. నామినేషన్‌ కోసం అప్లై చేసేటప్పుడు పొరపాటు జరిగిందని అనుకుంటున్నా" ఎక్స్‌లో రాసుకొచ్చారు.

కాగా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం.. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌తో పాటు పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్లను నామినేట్‌ చేసింది. ప్యారిస్‌ ఒలిపింక్స్‌-2024 షూటింగ్‌లో మను రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)