Breaking News

T20 WC: కోహ్లి, హార్దిక్‌ వద్దు.. ఊహించని ఆటగాడికి ఛాన్స్‌!

Published on Fri, 04/26/2024 - 18:24

ఐపీఎల్‌-2024 ఫీవర్‌ ముగియగానే పొట్టి ప్రపంచకప్‌ రూపంలో క్రికెట్‌ ప్రేమికులకు మరో మెగా సమరం కనువిందు చేయనుంది. అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్‌-2024 టోర్నీ ఆరంభం కానుంది.

ఇక హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా జూన్‌ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్‌లో ప్రయాణం ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

విరాట్‌ కోహ్లి, హార్దిక్‌ పాండ్యాకు నో
ఈ క్రమంలో రోహిత్‌ శర్మకు జోడీగా విరాట్‌ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తే బాగుంటుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ సంచలన ఎంపికతో ముందుకు వచ్చాడు.

తన జట్టులో రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లికి చోటివ్వకపోగా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు బదులు ఊహించని పేరును తెరమీదకు తెచ్చాడు. కాగా ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్‌ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులు సాధించాడు.

అత్యధిక పరుగుల వీరుడి జాబితాలో టాప్‌లో కొనసాగుతూ.. ప్రస్తుతానికి ఆరెంజ్‌ క్యాప్‌ తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్యా ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నా టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హోదాలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.

ఊహించని ఆటగాళ్లకు చోటు
ఇక పాండ్యాతో ఇప్పటికే శివం దూబే పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్‌ మంజ్రేకర్‌ ఎంపిక చేసుకున్న జట్టులో కోహ్లితో పాటు హార్దిక్‌ పాండ్యా, శివం దూబేలకు చోటు దక్కలేదు. అంతేకాదు అనూహ్యంగా హార్దిక్‌ పాండ్యా సోదరుడు కృనాల్‌ పాండ్యాను మంజ్రేకర్‌ ఎంపిక చేసుకున్నాడు.

అదే విధంగా లక్నో యువ సంచలనం, స్పీడ్‌గన్‌ మయాంక్‌ యాదవ్‌కు కూడా తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న లెఫ్టార్మ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా.. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. అదే విధంగా.. 8 మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు.

టీ20 ప్రపంచకప్‌-2024కు సంజయ్‌ మంజ్రేకర్‌ ఎంచుకున్న భారత జట్టు:
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ఆవేశ్‌ ఖాన్‌, హర్షిత్‌ రాణా, మయాంక్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా.

చదవండి: T20 WC 2024: దాదాపు 900 రన్స్‌ చేశా.. నాకు చోటు ఇవ్వకపోతే: గిల్‌ కామెంట్స్‌ వైరల్‌

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)