Breaking News

మనిక మెరిసె

Published on Tue, 08/06/2024 - 07:22

పారిస్‌: ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మహిళల టీమ్‌ ఈవెంట్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3–2తో రొమేనియా జట్టును బోల్తా కొట్టించింది. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 

స్టార్‌ ప్లేయర్‌ మనిక బత్రా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించింది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–అర్చనా కామత్‌ జోడీ 11–9, 12–10, 11–7తో అదీనా దియకోను–ఎలిజబెటా సమారా (రొమేనియా) జంటను ఓడించి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో మ్యాచ్‌లో మనిక 11–5, 11–7, 11–7తో బెర్నాడెట్టె జాక్స్‌పై గెలిచింది. 

 దాంతో భారత్‌ ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌లో భారత నంబర్‌వన్‌ శ్రీజ 11–8, 4–11, 11–7, 6–11, 8–11తో ఎలిజబెటా సమారా చేతిలో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్‌లో అర్చన 5–11, 11–8, 7–11, 9–11తో బెర్నాడెట్టె జాక్స్‌ చేతిలో ఓటమి పాలైంది. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో మనిక 11–5, 11–9, 11–8తో అదీనా దియకోనుపై గెలిచి భారత్‌కు 3–2తో విజయాన్ని అందించింది. నేడు అమెరికా, జర్మనీ జట్ల మధ్య మ్యాచ్‌ విజేతతో బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో భారత జట్టు ఆడతుంది.    

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)