Breaking News

క్వార్టర్‌ ఫైనల్లో మాళవిక బన్సోద్‌

Published on Fri, 09/20/2024 - 03:50

చాంగ్జౌ: భారత యువ షట్లర్‌ మాళవిక బన్సోద్‌ చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టో ర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో తనకన్నా ఎక్కువ ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్‌ను ఓడించి సత్తా చాటింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 43వ ర్యాంకర్‌ మాళవిక 21–17, 19–21, 21–16తో రెండుసార్లు కామన్వెల్త్‌ క్రీడల చాంపియన్‌ క్రిస్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)ను కంగు తినిపించింది. 

ప్రపంచ 25వ ర్యాంకర్‌తో జరిగిన ఈ పోరులో ప్రతి గేమ్‌లోనూ ఒక్కో పాయింట్‌ గెలించేందుకు 22 ఏళ్ల మాళవిక చెమటోడ్చాల్సి వచ్చింది. రెండో గేమ్‌లో ఆఖరిదాకా పోరాడినా... గేమ్‌ను 2 పాయింట్ల తేడాతో కోల్పోయిన భారత షట్లర్‌ నిర్ణాయక మూడో గేమ్‌లో పుంజుకొని ఆడింది. 

ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని పెంచుకుంటూ 21–16తో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలిచింది.  క్వార్టర్‌ ఫైనల్లో భారత ప్లేయర్‌కు మరింత క్లిష్టమైన ప్రత్యర్థి ఎదురవుతోంది. శుక్రవారం జపాన్‌కు చెందిన నాలుగో సీడ్‌ అకానె యామగుచితో మాళవిక తలపడుతుంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం మాళవిక మాట్లాడుతూ ‘బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 

ఓ పెద్దస్థాయి టో ర్నీలో ముందంజ వేయాలన్న నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. టోర్నీకి ముందే క్వార్టర్స్‌ చేరితే బాగుండేదనిపించింది. ఇప్పుడు టాప్‌–8కు అర్హత సంపాదించడం గొప్ప అనుభూతినిస్తోంది’ అని తెలిపింది.  

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)