Breaking News

మలింగ సూప‌ర్ యార్క‌ర్‌.. నోరెళ్లబెట్టిన పాక్ కెప్టెన్‌! వీడియో

Published on Fri, 10/25/2024 - 18:29

ఎమ‌ర్జింగ్ ఆసియాక‌ప్‌-2024లో పాకిస్తాన్-ఎ క‌థ ముగిసింది.  అల్ అమెరత్ వేదిక‌గా శ్రీలంక‌-ఎతో జ‌రిగిన తొలి సెమీఫైన‌ల్లో 7 వికెట్ల తేడాతో పాక్ ఓట‌మి చ‌విచూసింది. 136 ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రీలంక కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 17.2 ఓవ‌ర్ల‌లో ఊదిప‌డేసింది.

లంక బ్యాట‌ర్ల‌లో అహన్ విక్రమసింఘే(44) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ల‌హిరు   ఉదరా(43) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌల‌ర్ల‌లో సుఫియాన్ ముఖీమ్, అబ్బాస్ అఫ్రిది తలా వికెట్ మాత్ర‌మే సాధించారు.

అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 135 ప‌రుగుల‌కే విఫ‌ల‌మైంది. పాక్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ యూస‌ఫ్‌(68) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. లంక బౌలర్ల‌లో స్పిన్న‌ర్ హేమంత 4 వికెట్ల‌తో పాక్ ప‌త‌నాన్ని శాసించ‌గా.. ఇషాన్ మ‌లింగ, ర‌న్షిక త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

మలింగ సూప‌ర్ యార్క‌ర్‌..
అయితే ఈ మ్యాచ్‌లో లంక స్పీడ్ స్టార్ ఇషాన్ మ‌లింగ సంచ‌ల‌న బంతితో మెరిశాడు. పాక్ కెప్టెన్ మ‌హ్మ‌ద్ హ్యారీస్‌ను అద్భుత‌మైన యార్క‌ర్‌తో మ‌లింగ క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ ఇన్నింగ్స్‌ 6 ఓవ‌ర్‌లో మ‌లింగ‌ ఆఖ‌రి బంతిని వేసే క్ర‌మంలో హ్యారీస్ ముందుగానే తన కుడి వైపునకు వెళ్లి ర్యాంప్ షాట్ ఆడాల‌న‌కున్నాడు.

ఇది గ‌మ‌నించిన ఎషాన్ మలింగ చాలా తెలివిగా మిడిల్ అండ్ లెగ్‌పై అద్భుత‌మైన‌ యార్కర్‌ను బౌల్ చేశాడు. బుల్లెట్‌లా దూసుకు వ‌చ్చిన బంతిని క‌న‌క్ట్ చేయ‌డంలో పాక్ కెప్టెన్ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)