Breaking News

ఫైనల్లో ‍హెచ్‌ఎస్‌ ప్రణయ్‌.. సింధు కథ ముగిసే

Published on Sat, 05/27/2023 - 21:46

మ‌లేషియా మాస్టర్స్ సూప‌ర్ 500 టోర్న‌మెంట్‌లో తెలుగుతేజం పీవీ సింధు కథ ముగిసింది. మ‌హిళ‌ల సింగిల్స్‌లో ప‌త‌కంపై ఆశ‌లు రేపిన ఒలింపిక్ ప‌త‌క విజేత‌ పీవీ సింధు(PV Sindhu) ఇంటిదారి ప‌ట్టింది. శ‌నివారం జ‌రిగిన‌సెమీఫైన‌ల్లో ఆమె జార్జియా మ‌రిస్కా తుంజంగ్(ఇండోనేషియా) చేతిలో 14-21,17-21తో ఓట‌మిపాలైంది. 

అయితే పురుషుల విభాగంలో మాత్రం స్టార్ ష‌ట్ల‌ర్ హెచ్‌హెస్ ప్ర‌ణ‌య్(HS Prannoy) మ‌లేషియా మాస్టర్స్ సూప‌ర్ 500 ఫైన‌ల్లోకి దూసుకెళ్లాడు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా రాణించిన ఈ తెలుగు కుర్రాడు టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. ఈ ఏడాది అత‌డికి ఇదే తొలి ఏటీపీ ఫైన‌ల్ కావ‌డం విశేషం.

ఫామ్‌లో ఉన్న‌ ప్ర‌ణ‌య్ సెమీఫైన‌ల్లో క్రిస్టియ‌న్ ఆదినాథ‌(ఇండేనేషియా)తో త‌ల‌ప‌డ్డాడు. అయితే.. క్రిస్టియ‌న్ మోకాలి గాయంతో ఆట మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్నాడు. 19-17 పాయింట్ల‌తో ఆధిక్యంలో ఉన్న క్రిస్టియ‌న్ మ్యాచ్ మ‌ధ్య‌లో జంప్ చేసి వెన‌క్కి తిరుగుతుండ‌గా మోకాలి నొప్పితో విల‌విల‌లాడాడు.

దాంతో, వెంట‌నే ప్ర‌ణ‌య్, భార‌త కోచ్ అత‌డి వ‌ద్ద‌కు ప‌రుగెత్తుకెళ్లారు. ఆట కొన‌సాగించేందుకు క్రిస్టియ‌న్ సిద్ధంగా లేక‌పోవ‌డంతో అడిని వీల్ చైర్ సాయంతో కోర్టు బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. దాంతో నిర్వాహ‌కులు ప్ర‌ణ‌య్‌ని విజేత‌గా ప్ర‌క‌టించారు. ఆదివారం జ‌ర‌గ‌నున్న‌ టైటిల్ పోరులో వెంగ్ హాంగ్ యాంగ్‌(చైనా), లిన్ చున్ యీ(చైనీస్ తైపీ) మ్యాచ్ విన్న‌ర్‌తో అత‌డు త‌ల‌ప‌డ‌నున్నాడు.

చదవండి: 'త్వరలో మిమ్మల్ని కలుస్తా'.. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)