Breaking News

Malaysia Masters 2024 badminton: శ్రమించి గెలిచిన సింధు

Published on Fri, 05/24/2024 - 06:30

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ పీవీ సింధు, రైజింగ్‌ స్టార్‌ అషి్మత చాలిహా క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు 21–13, 12–21, 21–14తో ప్రపంచ 34వ ర్యాంకర్‌ సిమ్‌ యు జిన్‌ (దక్షిణ కొరియా)పై కష్టపడి గెలుపొందగా... ప్రపంచ 53వ ర్యాంకర్‌ అషి్మత 21–19, 16–21, 21–12తో ప్రపంచ 10వ ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా)ను బోల్తా కొట్టించింది. 

2022 ఇండియా ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన అష్మిత మళ్లీ రెండేళ్ల తర్వాత సూపర్‌–500 టోరీ్నలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరడం విశేషం. సిమ్‌తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సింధు నిలకడలేమితో ఇబ్బంది పడింది. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గిన సింధు రెండో గేమ్‌లో తడబడింది. రెండుసార్లు వరుసగా ఐదు పాయింట్ల చొప్పున ప్రత్యరి్థకి కోల్పోయింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో గాడిలో పడిన సింధు స్కోరు 16–14 వద్ద వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. 

పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కిరణ్‌ జార్జి (భారత్‌) 13–21, 18–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. మహిళల డబుల్స్‌లో భారత పోరు ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 70 నిమిషాల్లో 18–21, 22–20, 14–21తో సుంగ్‌ షువో యున్‌–యు చెయున్‌ హుయ్‌ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోగా... రితిక–సిమ్రన్‌ జంట 17–21, 11–21తో పియర్లీ టాన్‌–థినా మురళీధరన్‌ (మలేసియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–సుమీత్‌ రెడ్డి (భారత్‌) జంట 9–21, 15–21తో టాప్‌ సీడ్‌ చెన్‌ టాంగ్‌ జి–టో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్‌–సాయిప్రతీక్‌ ద్వయం 11–21, 9–21తో హి జి టింగ్‌–రెన్‌ జియాంగ్‌ యు (చైనా) జోడీ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో టాప్‌ సీడ్‌ హాన్‌ యువె (చైనా)తో సింధు; ఆరో సీడ్‌ జాంగ్‌ యి మాన్‌ (చైనా)తో అషి్మత తలపడతారు.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)