Breaking News

పాకిస్తాన్‌ బ్యాటర్‌కు ఊహించని షాకిచ్చిన బోర్డు.. ఎయిర్‌ పోర్ట్‌ నుంచే రిటర్న్‌!?

Published on Mon, 01/22/2024 - 10:40

పాకిస్తాన్‌ యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్ హరీస్ కు ఆ దేశ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ఊహించని షాకిచ్చింది. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గోనేందుకు ఢాకాకు వెళ్లిన హరీస్‌కు నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌(ఎన్‌ఓసి) ఇచ్చేందుకు పీసీబీ నిరాకరించింది. దీంతో అతడు ఢాకా విమానాశ్రయం నుంచే స్వదేశానికి తిరుగుముఖం పట్టాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 

లగేజీ ఫోటోలను షేర్‌ చేస్తూ బ్యాక్‌ టూ హోమ్‌ అని రాసుకొచ్చాడు. అయితే పీసీబీ రూల్స్‌ ప్రకారం..  ఆ దేశ క్రికెటర్లు రెండు విదేశీ లీగ్‌లు ఆడేందుకు మాత్రమే అర్హులు. కానీ హ్యారీస్‌ ఇప్పటికే రెండు ఫ్రాంచైజీ లీగ్‌లు ఆడాడు. ఈ క్రమంలోనే మూడో లీగ్‌లో ఆడేందుకు అతడికి పీసీబీ ఎన్‌ఓసి జారీ చేయలేదు.

కాగా బీబీఎల్‌లో చట్టోగ్రమ్‌ ఛాలెంజర్స్‌ తరఫున ఆడాల్సి ఉంది. అయితే ఫ్యాన్స్‌ మాత్రం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తీరును తప్పుబడుతున్నారు. ఎన్‌ఓసి విషయం అతడికి ముందే చెప్పి ఉంటే ఢాకా వరకు వెళ్లే వాడు కాదు కదా అంటూ మండిపడుతున్నారు. కాగా పాక్‌ తరపున ఇప్పటివరకు 9 టీ20లు ఆడిన మహ్మద్ హరీస్.. 126 పరుగులు మాత్రమే చేశాడు.
చదవండి: WI vs AUS: 29 బంతుల్లో విధ్వంసకర సెంచరీ.. ఆసీస్‌ జట్టులో ఛాన్స్‌ కొట్టేశాడు!

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)