Breaking News

రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ క్రికెట‌ర్‌.. 17 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై

Published on Thu, 07/04/2024 - 15:48

బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ మ‌హ్మ‌దుల్లా రియాద్‌ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు మ‌హ్మ‌దుల్లా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024 ముగిసిన అనంత‌రం రియాద్ త‌న నిర్ణ‌యాన్ని బంగ్లా క్రికెట్ బోర్డుకు తెలియ‌జేసిన‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ విష‌యం కాస్త ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. కాగా  2007లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన మహ్మదుల్లా 17 ఏళ సుదీర్ఘ కాలం పాటు బంగ్లా క్రికెట్‌కు త‌న సేవ‌ల‌ను అందించాడు.  మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 50 టెస్టులు, 232 వన్డేలు, 138 టీ20 మ్యాచ్ లాడాడు. 

మూడు ఫార్మాట్ లలో కలిపి 10,000 పైగా పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ 150 కి పైగా వికెట్లు తీసుకున్నాడు. గ‌తంలో బంగ్లా దేశ్ టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా కూడా మ‌హ్మ‌దుల్లా పనిచేశాడు. 2018లో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో అత‌డి సార‌థ్యంలోని బంగ్లా జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరింది. ఇక టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో బంగ్లాదేశ్ సూప‌ర్‌-8 రౌండ్‌లో నిష్క‌మ్రించింది. సూపర్ 8 లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ బంగ్లా జ‌ట్టు ఓట‌మి పాలైంది.
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)