శ్రీలంక స్పిన్నర్‌ హ్యాట్రిక్‌.. అరుదైన జాబితాలో చోటు

Published on Wed, 01/08/2025 - 14:18

హామిల్ట‌న్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో శ్రీలంక స్టార్ స్పిన్న‌ర్ హ్యాట్రిక్ వికెట్ల‌తో మెరిశాడు. కివీస్ ఇన్నింగ్స్ 35 ఓవ‌ర్‌లో ఆఖ‌రి రెండు బంతుల‌కు వ‌రుస‌గా రెండు వికెట్లు తీసిన మహేశ్ తీక్షణ.. ఆ త‌ర్వాత  37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో త‌న‌ తొలి హ్యాట్రిక్‌ను అందుకున్నాడు.

న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్‌ను తొలుత ఔట్ చేసిన ఈ లంక మిస్ట‌రీ స్పిన్న‌ర్.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా నాథ‌న్ స్మిత్, మాట్ హెన్రీని ఔట్ చేసి ఈ మైలు రాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 8 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన తీక్ష‌ణ 44 ప‌రుగులిచ్చి 4 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు.

కాగా ఈ మ్యాచ్‌ను వ‌ర్షం కార‌ణంగా 37 ఓవ‌ర్ల‌కు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 255 ప‌రుగులు చేసింది. కివీస్‌ బ్యాటర్లలో రచిన్‌ రవీంద్ర(79) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. చాప్‌మన్‌(62), మిచెల్‌(38) పరుగులతో రాణించారు.

లంక బౌలర్లలో తీక్షణతో పాటు హసరంగా రెండు, మలింగ, ఫెర్నాండో తలా వికెట్‌ సాధించారు. లక్ష్య చేధనలో శ్రీలంక పోరాడుతోంది. 26 ఓవర్లు ముగిసే సరికి లంక 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. క్రీజులో కమిందు మెండిస్‌(63) పరుగులతో ఉన్నాడు.

ఇక ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన తీక్షణ ఓ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో హ్యాట్రిక్ సాధించిన ఏడో శ్రీలంక బౌలర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక దిగ్గజ బౌలర్ చమిందా వాస్ ఉన్నాడు. 2001లో జింబాబ్వేపై వాస్ తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. తర్వాత 2003లో బంగ్లాదేశ్‌పై వాస్ మరో హ్యాట్రిక్ నమోదు చేశాడు.

 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)