Breaking News

మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ‘డబుల్‌’

Published on Mon, 11/18/2024 - 03:48

ప్రపంచ నంబర్‌వన్‌ గ్రాండ్‌మాస్టర్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా బ్లిట్జ్‌ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. రెండు రోజుల వ్యవధిలో 18 రౌండ్ల పాటు (9 చొప్పున) జరిగిన ఈ కేటగిరీ పోటీల్లో అతను మరో రౌండ్‌ మిగిలుండగానే టైటిల్‌ సాధించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే ర్యాపిడ్‌ టైటిల్‌ గెలుచుకున్న 33 ఏళ్ల నార్వే సూపర్‌స్టార్‌ బ్లిట్జ్‌లోనూ తిరుగులేదని నిరూపించుకున్నాడు. 

శనివారం ఎనిమిదో రౌండ్లో తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ చేతిలో కంగుతిన్న కార్ల్‌సన్‌ ఆదివారం జరిగిన ‘రిటర్న్‌’ ఎనిమిదో రౌండ్‌లో అర్జున్‌నే ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకోవడం విశేషం. అప్పటికే 12 పాయింట్లు ఉండటంతో టైటిల్‌ రేసులో అతనొక్కడే నిలిచాడు. 

చివరకు ఆఖరి రౌండ్‌ (9వ)లోనూ కార్ల్‌సన్‌... భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ గుజరాతిని ఓడించడంతో మొత్తం 13 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచాడు. ఫిలిపినో–అమెరికన్‌ గ్రాండ్‌మాస్టర్‌ వెస్లీ సో 11.5 పాయింట్లతో రన్నరప్‌తో సంతృప్తి పడగా, తెలంగాణ స్టార్‌ అర్జున్‌ ఇరిగేశి(10.5)కి మూడో స్థానం దక్కింది. భారత ఆటగాళ్లు ఆర్‌. ప్రజ్ఞానంద (9.5), విదిత్‌ (9) వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.  

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)