Breaking News

క్వీన్‌ కీస్‌...

Published on Sun, 01/26/2025 - 03:45

మెల్‌బోర్న్‌: పదేళ్ల క్రితం 19 ఏళ్ల ప్రాయంలో ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ లోనే మాడిసన్‌ కీస్‌ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకొని వెలుగులోకి వచ్చింది. సీన్‌ కట్‌ చేస్తే... పదేళ్ల తర్వాత అదే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ లో ఆమె తన గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ కలను నెరవేర్చుకుంది. 19వ సీడ్‌గా ఈ ఏడాది ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన ప్రపంచ 14వ ర్యాంకర్‌ మాడిసన్‌ కీస్‌... అందరి అంచనాలను తారుమారు చేసి చివరకు చాంపియన్‌గా అవతరించింది. 

గత రెండేళ్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచి... ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌కు సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్‌ ఓపెన్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గి జోరు మీదున్న బెలారస్‌ స్టార్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సబలెంకాను ఓడించిన కీస్‌ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో కీస్‌ 6–3, 2–6, 7–5తో సబలెంకాపై గెలిచింది. 

విజేతగా నిలిచిన మాడిసన్‌ కీస్‌కు 35 లక్షల ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 19 కోట్ల 3 లక్షలు)... రన్నరప్‌ సబలెంకాకు 19 లక్షల ఆ్రస్టేలియన్‌ డాలర్లు (రూ. 10 కోట్ల 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  టైటిల్‌ గెలిచే క్రమంలో కీస్‌ ముగ్గురు గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్స్‌ను (రిబా కినా, స్వియాటెక్, సబలెంకా) ఓడించడం విశేషం. 2 గంటల 2 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో కీస్‌ ఆరు ఏస్‌లు సంధించింది. 29 విన్నర్స్‌ కొట్టింది. 31 అనవసర తప్పిదా లు చేసింది. 

తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. మరోవైపు సబలెంకా ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసింది. నేడు యానిక్‌ సినెర్‌ (ఇటలీ), అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) మధ్య పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఫైనల్‌ మొదలవుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)