5 స్వర్ణాలు సహా మొత్తం 7 పతకాలు సాధించిన నటుడు మాధవన్‌ తనయుడు

Published on Sun, 02/12/2023 - 15:24

Khelo India Games 2023: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆర్‌ మాధవన్‌ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అతని కుమారుడు, భారత అప్‌ కమింగ్‌ స్విమ్మర్‌ వేదాంత్‌ మాధవన్‌ ఖేలో ఇండియా గేమ్స్‌-2023లో పతకాల వర్షం కురిపించాడు. ఈ పోటీల్లో మహారాష్ట్ర తరఫున బరిలోకి దిగిన వేదాంత్‌.. 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలు సహా మొత్తం 7 పతకాలను కైవసం చేసుకున్నాడు.

100, 200, 1500 మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు సాధించిన వేదాంత్‌.. 400, 800 మీట్లర​ రేసులో రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. వేదాంత్‌ కొలనులో బంగారు చేపలా రెచ్చిపోయి పతకాలు సాధించడంతో అతను ప్రాతినిధ్యం వహించిన మహారాష్ట్ర మొత్తంగా 161 పతకాలు (56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్యాలు) సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో కూడా అత్యధిక పతకాలు సాధించిన మహారాష్ట్ర టీమ్‌ మరో ట్రోఫీని సాధించింది.

కొడుకు వేదాంత్‌ ప్రదర్శనతో ఉబ్బితబ్బిబైపోతున్న మాధవన్‌.. అతనికి, మహారాష్ట్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ట్వీట్‌లు చేశాడు. వేదాంత్‌, ఫెర్నాండెస్‌ అపేక్ష (6 గోల్డ్‌, 1 సిల్వర్‌) ప్రదర్శన పట్ల చాలా గర్వంగా ఉంది. వీరి ప్రదర్శన వెనుక తిరుగలేని కృషి చేసిన  కోచ్‌ ప్రదీప్‌ సర్‌, చౌహాన్‌ శివ్‌రాజ్‌లకు ధన్యవాదాలు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ గారికి కృతజ్ఞతలు అంటూ తొలి ట్వీట్‌ చేశాడు.

ఆ తర్వాత ట్వీట్‌లో  మాధవన్‌ తన కుమారుడు సాధించిన పతకాల వివరాలను పొందుపరిచాడు. మరో ట్వీట్‌లో టీమ్‌ మహారాష్ట్ర, ఆ రాష్ట్ర బాయ్స్‌ టీమ్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. ఇటీవల కాలంలో కొలనులో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న వేదాంత్‌ దుబాయ్‌లో ఒలింపిక్స్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. వేదాంత్‌ కోసం మాధవన్‌ తన ఫ్యామిలీ మొత్తాన్ని దుబాయ్‌కు షిఫ్ట్‌ చేశాడు.  కాగా, గతేడాది డానిష్‌ ఓపెన్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా వేదాంత్‌ తొలిసారి వార్తల్లోకెక్కాడు. 

Videos

రైలు ప్రమాదంపై YS జగన్ దిగ్భ్రాంతి

ల్యాప్‌టాప్‌ల కోసం ఎగవడ్డ జనం

జిల్లాల పునర్విభజన వెనుక బాబు మాస్టర్ ప్లాన్!

మందు కొట్టి.. పోలీసులను కొట్టి.. నేవీ ఆఫీసర్ రచ్చ రచ్చ

అల్లు అర్జున్ కు ఓ న్యాయం.. చంద్రబాబుకు ఓ న్యాయమా ?

యూరియాతో పాల తయారీ

ఎర్నాకులం ఎక్స్ ప్రెస్ లో మంటలు.. ప్రమాదం ఎలా జరిగిందంటే

20 పొట్టేళ్ల తలలు దండ చేసి బాలకృష్ణకు వేస్తే నీకు కనిపించలేదా?

అసెంబ్లీకి గులాబీ బాస్! ఇక సమరమే..!!

మంత్రి నారాయణ ఆడియో లీక్.. రౌడీషీటర్లకు డిసెంబర్ 31st ఆఫర్

Photos

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)