Breaking News

షనక ఊచకోత.. చాప్‌మన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ వృధా

Published on Tue, 07/02/2024 - 08:12

లంక ప్రీమియర్‌ లీగ్‌ 2024 ఎడిషన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ క్యాండీ ఫాల్కన్స్‌ ఘన విజయం సాధించింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో దంబుల్లా సిక్సర్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సిక్సర్స్‌.. మార్క్‌ చాప్‌మన్‌ (61 బంతుల్లో 91 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), చమిందు విక్రమసింఘే (42 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. 

వీరిద్దరు మినహా సిక్సర్స్‌ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేదు. గుణతిలక 11, కుశాల్‌ పెరీరా 0, నువనిదు ఫెర్నాండో 4, తౌహిద్‌ హ్రిదోయ్‌ 1 పరుగు చేసి ఔటయ్యారు. ఫాల్కన్స్‌ బౌలర్లలో షనక 3 వికెట్లు పడగొట్టగా.. హస్నైన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఫాల్కన్స్‌.. దినేశ్‌ చండీమల్‌ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్‌ (20 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు, సిక్స్‌), షనక (15 బంతుల్లో 46 నాటౌట్‌; 23 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో 17.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. షనక సిక్సర్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 

ముస్తాఫిజుర్‌ వేసిన 16వ ఓవర్‌లో మూడు సిక్సర్లు, బౌండరీ సహా 23 పరుగులు పిండుకున్నాడు. సిక్సర్స్‌ బౌలర్లలో నువాన్‌ తుషార, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, అఖిల ధనంజయ, చమిందు విక్రమసింఘే తలో వికెట్‌ పడగొట్టారు.

లీగ్‌లో భాగంగా ఇవాళ (జులై 2) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్‌, గాలే మార్వెల్స్‌.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్‌, క్యాండీ ఫాల్కన్స్‌ పోటీపడనున్నాయి. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు