Breaking News

లవ్లీనా శుభారంభం

Published on Fri, 02/06/2026 - 03:52

అలికాంటె (స్పెయిన్‌): బాక్సమ్‌ ఎలైట్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ లవ్లీనా బొర్గోహైన్‌ శుభారంభం చేసింది. 75 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఈ అస్సాం బాక్సర్‌ తొలి రౌండ్‌లో 5:0తో ఒల్హా పిల్పిచుక్‌ (ఉక్రెయిన్‌)పై ఘనవిజయం సాధించింది. పురుషుల 70 కేజీల విభాగంలో హితేశ్‌ ముందంజ వేశాడు. హితేశ్‌ 5:0తో విన్సెంట్‌ సాంటోరీలో (కెనడా)పై గెలిచాడు. 

భారత్‌కే చెందిన మహిళా బాక్సర్లు మంజు రాణి (48 కేజీలు), నీతూ (51 కేజీలు) కూడా తమ ప్రత్యర్థులపై నెగ్గారు. మంజు రాణి 5:0తో గ్లోరియా (ఫ్రాన్స్‌)పై గెలుపొందగా... నీతూ పంచ్‌ల ధాటికి ఆమె ప్రత్యర్థి లౌరా కాల్డెరాన్‌ (స్పెయిన్‌) తొలి రౌండ్‌లోనే చేతులెత్తేసింది. కుసుమ్‌ (51 కేజీలు), అరుంధతి చౌధరీ (70 కేజీలు) కూడా గెలుపు రుచి చూశారు. కుసుమ్‌ 4:1తో క్లౌడియా అల్‌కానిజ్‌ (స్పెయిన్‌)పై, అరుంధతి 5:0తో అజీజా ఇసీనా (కజకిస్తాన)పై విజయం సాధించారు. 

విక్టోరియా పెన్నీ (కెనడా)తో జరిగిన 75 కేజీల విభాగం బౌట్‌లో సనమచ చాను (భారత్‌) 4:1తో నెగ్గింది. పురుషుల 55 కేజీల విభాగం బౌట్‌లో పవన్‌ బర్త్‌వాల్‌ పంచ్‌లకు తాళలేక అతని ప్రత్యర్థి థనారత్‌ (థాయ్‌లాండ్‌) రెండో రౌండ్‌లోనే ఓటమిని అంగీకరించాడు. జాదుమణి సింగ్‌ (51 కేజీలు) 4:1తో సియోవుష్‌ (ఉక్రెయిన్‌)పై, దీపక్‌ (70 కేజీలు) 5:0తో డేవిడ్‌ రొసాలెన్‌ (స్పెయిన్‌)పై, అంకుశ్‌ (80 కేజీలు) 3:2తో జఖ్‌పెకోవ్‌ (కజకిస్తాన్‌)పై నెగ్గారు. హర్‌‡్ష (90 కేజీలు) 5:0తో బ్రయాన్‌ కాల్‌వెల్‌ (కెనడా)ను ఓడించి ముందంజ వేశాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)