Breaking News

బెంగళూరును గెలిపించిన శోభన

Published on Sun, 02/25/2024 - 04:29

బెంగళూరు: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి భారత బౌలర్‌గా శోభన ఆశ (5/22) నిలిచింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో విజయం దిశగా వెళుతున్న యూపీ వారియర్స్‌ను శోభన తన అద్భుత బౌలింగ్‌తో బ్రేక్‌ వేసింది. శనివారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 2 పరుగుల తేడాతో యూపీని ఓడించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.  రిచా ఘోష్‌ (37 బంతుల్లో 62; 12 ఫోర్లు), సబ్బినేని మేఘన (44 బంతుల్లో 53; 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలు చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు.  కెపె్టన్‌ స్మృతి మంధాన (13), సోఫీ డివైన్‌ (1), ఎలైస్‌ పెరీ (8) విఫలమయ్యారు.

యూపీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో చివరి ఐదు ఓవర్లలో బెంగళూరు 42 పరుగులే చేయగలిగింది. అనంతరం యూపీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. గ్రేస్‌ హారిస్‌ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్వేత సెహ్రావత్‌ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఛేదనలో 16 ఓవర్లు ముగిసే సరికి యూపీ స్కోరు 126/3. గెలుపు కోసం 24 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన స్థితి.

అయితే శోభన జోరుకు 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయి జట్టు తడబాటుకు గురైంది. తర్వాతి 2 ఓవర్లలో 19 పరుగులు రాబట్టి గెలుపుపై యూపీ ఆశలు పెంచుకుంది. చివరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా, తొలి 5 బంతుల్లో 6 పరుగులు వచ్చాయి. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌ తరహాలోనే ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం కాగా...దీప్తి శర్మ 2 పరుగులే తీయగలిగింది.  

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)