Breaking News

ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు.. టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌

Published on Thu, 07/31/2025 - 11:58

అండ‌ర్స‌న్‌-టెండూల్క‌ర్ ట్రోఫీలో తుది స‌మ‌రానికి స‌మయం అసన్న‌మైంది. ఈ ట్రోఫీలో భాగంగా గురువారం లండ‌న్‌లోని ఓవ‌ల్‌ నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టులో భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ప్ర‌స్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1 ఆధిక్యంలో కొన‌సాగుతోంది.

దీంతో ఓవల్ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను స‌మం చేయాల‌ని గిల్ సేన భావిస్తోంది. అయితే భార‌త ఆశ‌ల‌కు వ‌రుణుడు బ్రేక్ వేసే అవకాశముంది. ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆటకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. వాతావరణ శాఖ సూచన ప్రకారం.. గురువారం(జూలై 31) రోజంతా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.

తొలి రోజు ఆటలో దాదాపు 4 గంటల పాటు వర్షం పడేందుకు ఆస్కారం ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్ట్ వెల్లడించింది. మొదటి రోజు మాత్రమే కాకుండా మిగితా నాలుగు రోజులు కూడా తేలికపాటి జల్లులు కురిసే ఛాన్స్ ఉంది.

ఆక్యూ వెదర్‌ రిపోర్ట్‌ ప్రకారం..
ఉదయం 11- 80 % వర్షం పడే అవకాశం       
మధ్యాహ్నం 12- 70% వర్షం పడే అవకాశం
మధ్యాహ్నం 1 -70% వర్షం పడే అవకాశం​
మధ్యాహ్నం 2- 60% వర్షం పడే అవకాశం​
మధ్యాహ్నం 3- 60% వర్షం పడే అవకాశం​
సాయంత్రం 4- 60% వర్షం పడే అవకాశం​
సాయంత్రం 5- 40% వర్షం పడే అవకాశం​
సాయంత్రం 6- 30% వర్షం పడే అవకాశం​

ఇంగ్లండ్ వర్సెస్ భారత్ ఐదవ టెస్ట్
వేదిక: కెన్నింగ్టన్ ఓవల్, లండన్
తేదీ: జూలై 31-ఆగస్టు 4
సమయం: భారత కాలమానం ప్రకారం(మధ్యాహ్నం 3:30)
టాస్‌: మధ్యాహ్నం 3:00 గంటలకు 
లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్‌
లైవ్ బ్రాడ్‌కాస్ట్: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్

తుది జట్ల వివరాలు:  
భారత్‌ (అంచనా): శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్ ), యశస్వి జైస్వాల్, కేఎల్‌ రాహుల్, సాయి సుదర్శన్, వాషింగ్టన్‌ సుందర్, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురేల్, శార్దుల్‌ ఠాకూర్‌/ప్రసిధ్‌ కృష్ణ, అర్ష్ దీప్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌, సిరాజ్‌.

ఇంగ్లండ్‌: ఓలీ పోప్‌ (కెప్టెన్ ), జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెతెల్, జేమీ స్మిత్, క్రిస్‌ వోక్స్, అట్కిన్సన్, ఒవర్టన్, టంగ్‌.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)