Breaking News

చిత్తైన గంభీర్‌ జట్టు.. ఫైనల్లో హర్భజన్‌ టీమ్‌

Published on Fri, 12/08/2023 - 11:35

లెజెండ్స్‌ లీగ్‌ 2023 ఎడిషన్‌ తుది అంకానికి చేరింది. ఫైనల్లో తలపడబోయే జట్లేవో తేలిపోయాయి. క్వాలిఫయర్‌-1లో విజయం సాధించడం​ ద్వారా అర్బన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫైనల్‌కు చేరింది. నిన్న (డిసెంబర్‌ 7) జరిగిన క్వాలిఫయర్‌-2లో గౌతమ్‌ గంభీర్‌ నేతృత్వంలోని ఇండియా టైగర్స్‌ను ఓడించడం ద్వారా హర్భజన్‌ సింగ్‌ సారథ్యంలోని మణిపాల్‌ టైగర్స్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. 

క్వాలిఫయర్‌-2లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా క్యాపిటల్స్‌.. కెవిన్‌ పీటర్సన్‌ (27 బంతుల్లో 56; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మెక్‌క్లెనెగన్‌, తిసార పెరీరా తలో 3 వికెట్లు తీసి క్యాపిటల్స్‌ పతనాన్ని శాశించారు. 

అనంతరం బరిలోకి దిగిన మణిపాల్‌ టైగర్స్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అసేల గుణరత్నే (39 నాటౌట్‌), కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ (38 నాటౌట్‌) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి టైగర్స్‌ను విజయతీరాలకు చేర్చారు. టైగర్స్‌ ఇన్నింగ్స్‌లో చాడ్విక్‌ వాల్టన్‌ (33), ఏంజెలో పెరీరా (35) కూడా రాణించారు. క్యాపిటల్స్‌ బౌలర్లలో ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌, ఇసురు ఉడాన, దిల్హర ఫెర్నాండో, ఈశ్వర్‌ పాండే తలో వికెట్‌ పడగొట్టారు. టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌ డిసెంబర్‌ 9న జరుగనుంది. టైటిల్‌ కోసం అర్బన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, మణిపాల్‌ టైగర్స్‌ తలపడతాయి.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)