Breaking News

పాపం డేవిడ్‌ వార్నర్‌.. ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు..!

Published on Mon, 11/25/2024 - 08:35

నిన్న (నవంబర్‌ 24) ప్రారంభమైన ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో మొత్తం 92 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 72 మంది అమ్ముడుపోగా.. 20 మంది అన్‌ సోల్డ్‌గా మిగిలారు. అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. 

పాపం వార్నర్‌
నిన్న జరిగిన మెగా వేలంలో ఆసీస్‌ మాజీ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వార్నర్‌ 2 కోట్ల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తొలి రోజు వేలంలో వార్నర్‌తో పాటు దేవ్‌దత్‌ పడిక్కల్‌, జానీ బెయిర్‌స్టో లాంటి పేరు కలిగిన ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. వీరిద్దరు కూడా 2 కోట్ల బేస్‌ ప్రైజ్‌ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 

ఐపీఎల్‌ తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..!

దేవ్‌దత్‌ పడిక్కల్‌ (బేస్‌ ధర 2 కోట్లు)
డేవిడ్‌ వార్నర్‌ (2 కోట్లు)
జానీ బెయిర్‌స్టో (2 కోట్లు)
వకార్‌ సలామ్‌ఖిల్‌ (ఆఫ్ఘనిస్తాన్‌, 75 లక్షలు)
పియుశ్‌ చావ్లా (50 లక్షలు)
కార్తీక్‌ త్యాగి (40 లక్షలు)
యశ్‌ ధుల్‌ (30 లక్షలు)
అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (30 లక్షలు)
ఉత్కర్శ్‌ సింగ్‌ (30 లక్షలు)
లవ్నిత్‌ సిసోడియా (30 లక్షలు)
ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌ (30 లక్షలు)
శ్రేయస్‌ గోపాల్‌ (30 లక్షలు)

కాగా, తొలి రోజు వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిసి  467.85 కోట్లు ఖర్చు చేశాయి. తొలి రోజు వేలంలో రిషబ్‌ పంత్‌కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది భారీ ధర.

నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్‌ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్‌ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్‌ అయ్యర్‌కు లభించింది. వెంకటేశ్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్‌ సింగ్‌, యుజ్వేంద్ర చహల్‌లను పంజాబ్‌ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్‌ రాహుల్‌కు భారీ ధర దక్కలేదు. రాహుల్‌ను ఢిల్లీ కేవలం రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)