Breaking News

వింబుల్డన్‌ 'క్వీన్‌' లిండా నెస్కోవా

Published on Sat, 07/11/2026 - 23:47

లండన్‌: ఇద్దరూ ఒకే దేశానికి చెందిన ప్లేయర్లు...ఒకరి ఆట గురించి మరొకరికి బాగా తెలుసు...2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో డబుల్స్‌ జోడీగా సెమీ ఫైనల్‌ వరకు కూడా వెళ్లారు. చెక్‌ రిపబ్లిక్‌ దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసిన ఈ పోరు ఆసక్తికరంగా సాగగా చివరకు లిండా నెస్కోవాదే పైచేయి అయింది. 21 ఏళ్ల నెస్కోవా వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం 2 గంటల 28 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో 9వ సీడ్‌ నెస్కోవా 6–2, 5–7, 6–3తో 10వ సీడ్‌ కరోలినా ముకోవాపై విజయం సాధించింది. 

తొలి సెట్‌ కోల్పోయిన తర్వాత రెండో సెట్‌లో ముకోవా ‘ఐదు చాంపియన్‌షిప్‌ పాయింట్లు’ కాపాడుకోవడంతో స్కోరు సమమైంది. అయితే చివరి సెట్‌లో ఒత్తిడిని అధిగమించి తన సీనియర్‌పై నెస్కోవా ఆధిక్యాన్ని ప్రదర్శించింది.  గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరిన తొలి ప్రయత్నంలోనే నెస్కోవా విజేతగా నిలవగా, 2023 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఓడిన ముకోవా మరోసారి రన్నరప్‌ స్థానానికే పరిమితమైంది. విజేతగా నిలిచిన నెస్కోవాకు 36 లక్షల పౌండ్లు (సుమారు రూ.46 కోట్లు), రన్నరప్‌ ముకోవాకు 18 లక్షల పౌండ్లు (సుమారు రూ.23 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

తొలి సెట్‌లో నెస్కోవా అలవోకగా నెగ్గి దూసుకుపోయింది. నాలుగో గేమ్‌ను బ్రేక్‌ చేసిన నెస్కోవా ఐదో గేమ్‌లో సర్వీస్‌ నిలబెట్టుకొని 4–1తో ముందంజ వేసింది. తర్వాతి గేమ్‌ను గెలిచి ముకోవా కాస్త ప్రతిఘటించినా...ఆ తర్వాత వరుసగా రెండు గేమ్‌లు నెగ్గి నెస్కోవా సెట్‌ను సొంతం చేసింది. రెండో సెట్‌లో కూడా నెస్కోవా జోరు చూస్తే మ్యాచ్‌ వేగంగా ముగిసిపోతున్నట్లు అనిపించింది. నాలుగు గేమ్‌ల తర్వాత 2–2తో ఇద్దరు సమంగా ఉండగా...వరుసగా మూడు గేమ్‌లు సాధించి నెస్కోవా 5–2 వద్ద నిలిచింది. ఈ స్థితిలో ముకోవా ఒక్కసారిగా తన అనుభవాన్నంతా ఉపయోగించి పోరాడింది. 

మూడు సార్లు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని ఎనిమిదో గేమ్‌ను గెలుచుకుంది. ఆపై మరింత చెలరేగుతూ వరుసగా నాలుగు గేమ్‌లు గెలుచుకోవడం విశేషం. ఈ క్రమంలో మరో రెండు సార్లు నెస్కోవా మ్యాచ్‌ పాయింట్లను చేజార్చుకుంది. 12వ గేమ్‌ను ఫోర్‌హ్యాండ్‌ విన్నర్‌తో ముగించి ముకోవా రెండో సెట్‌ను సాధించింది. మూడో సెట్‌లో నెస్కోవా మళ్లీ సత్తా చాటి పైచేయి సాధించింది. ముకోవా వరుసగా అనవసరపు తప్పిదాలు చేయడంతో నెస్కోవా 3–0తో ముందంజ వేసింది. 

నాలుగో గేమ్‌ను ముకోవా బ్రేక్‌ చేయగా, తర్వాత ఇద్దరూ సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో స్కోరు 5–3కి చేరింది. 9వ గేమ్‌లో వరుస పాయింట్లు సాధించిన నెస్కోవా పదునైన ఏస్‌తో మ్యాచ్‌ను ముగించింది. నెస్కోవా మొత్తం 10 ఏస్‌లతో ఆధిపత్యం ప్రదర్శించగా, 36 అన్‌ఫోర్స్‌డ్‌ ఎర్రర్స్‌తో ముకోవా ప్రత్యర్థికి గెలుపు అవకాశం ఇచ్చింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)