Breaking News

ఆ జట్టు కెప్టెన్‌గా యువరాజ్‌ సింగ్‌..

Published on Wed, 02/14/2024 - 16:55

టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ త్వరలోనే మళ్లీ బ్యాట్‌ పట్టనున్నాడు. లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ-2024లో భాగం కానున్నాడు. న్యూయార్క్‌ సూపర్‌స్టార్‌ స్ట్రైకర్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు.

ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ స్ట్రైకర్స్‌ బుధవారం కీలక ప్రకటన చేసింది. యువీని తమ కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు తెలిపింది. యువరాజ్‌ సింగ్‌ తమ జట్టుకు ఆడటం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఫ్రాంఛైజీ.. అతడికి సాదర స్వాగతం పలుకుతున్నామని పేర్కొంది. 

తొలి సీజన్‌ విజేతలుగా ఆ జట్లు
కాగా గతేడాది ప్రారంభమైన లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ టోర్నీలో ఆరు జట్లు చండీగఢ్‌ చాంప్స్‌, నాగ్‌పూర్‌ నింజాస్‌, పట్నా వారియర్స్‌, వైజాగ్‌ టైటాన్స్‌, ఇండోర్‌ నైట్స్‌, గువాహటి అవెంజర్స్‌ పాల్గొన్నాయి. 

మార్చి 22 నుంచి 30 వరకు ఘజియాబాద్‌లో టోర్నీ జరిగింది. ఇక మాజీ క్రికెటర్లు పాల్గొన్న ఈ టీ20 లీగ్‌లో సురేశ్‌ రైనా సారథ్యంలోని ఇండోర్‌ నైట్స్‌, యూసఫ్‌ పఠాన్‌ కెప్టెన్సీలోని గువాహటి అవెంజర్స్‌ సంయుక్త విజేతలుగా నిలిచాయి.

వర్షం కారణంగా ఫైనల్‌ మ్యాచ్‌ రద్దైన నేపథ్యంలో ఈ రెండు జట్లను చాంపియన్స్‌గా ప్రకటించారు. అయితే, ఈసారి ఈ లీగ్‌లో న్యూయార్క్‌ సూపర్‌స్టార్‌ స్ట్రైకర్స్‌ కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తాజా ప్రకటన ద్వారా తేలింది.

కండిషన్స్‌ ఇవే
ఇక లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ ఈసారి మార్చి 7 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. శ్రీలంకలోని కాండీ వేదికగా ఈ ఈవెంట్‌ ఆరంభం కానుంది. అదే విధంగా.. ఈసారి 90 బాల్‌ ఫార్మాట్లో టోర్నీ నిర్వహించనున్నట్లు సమాచారం.

ఇందులో భాగంగా ఓ జట్టు ఐదుగురు బౌలర్లను బరిలోకి ఇదింపి ఒక్కొక్కరిచే మూడు ఓవర్లు వేయించాలి. అయితే, కెప్టెన్‌ నిర్ణయానుసారం ఒక్కరిచే మాత్రం నాలుగు ఓవర్లు వేయించవచ్చు. అయితే, 60వ బంతి పడకముందే బౌలింగ్‌ జట్టు కెప్టెన్‌ తన నిర్ణయాన్ని చెప్పాల్సి ఉంటుంది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)