Breaking News

శ్రీలంక ఆటగాడి ఉగ్రరూపం.. సురేశ్‌ రైనా పోరాటం వృధా

Published on Mon, 03/11/2024 - 19:30

శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా జరుగుతున్న లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ 2024 ఎడిషన్‌లో ఇవాళ (మార్చి 11) ఢిల్లీ డెవిల్స్‌, న్యూయార్క్‌ సూపర్‌ స్టార్‌ స్ట్రయికర్స్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ యువరాజ్‌ సింగ్‌ సారధ్యం వహించిన న్యూయార్క్‌ జట్టు.. సురేశ్‌ రైనా నాయకత్వంలోని ఢిల్లీ డెవిల్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది. 

తిరిమన్నే విశ్వరూపం..
తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూయార్క్‌.. లంక ఆటగాడు లహీరు తిరిమన్నే (39 బంతుల్లో 90; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించడంతో నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. న్యూయార్క్‌ ఇన్నింగ్స్‌లో తిరిమన్నే మినహా ఎవరూ రాణించలేదు. ఢిల్లీ బౌలర్లలో అనురీత్‌ సింగ్‌, మల్హోత్రా తలో 2 వికెట్లు పడగొట్టగా.. అబ్దుల్లా, అమితోజ్‌సింగ్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

సురేశ్‌ రైనా పోరాటం వృధా..
186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. సురేశ్‌ రైనా (35 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చివరివరకు అజేయంగా నిలిచాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అంబటి రాయుడు (19) నిరాశపరిచాడు. న్యూయార్క్‌ బౌలర్లలో ఉదాన 3 వికెట్లు పడగొట్టగా.. రాహుల్‌ శర్మ, గ్రాండ్‌హోమ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)