Breaking News

స్టువర్ట్‌ బిన్నీ ఊచకోత.. రిచర్డ్‌ లెవి విధ్వంసం

Published on Sat, 03/25/2023 - 12:48

లెజెండ్స్‌ క్రికెట్‌ ట్రోఫీ-2023లో భాగంగా వైజాగ్‌ టైటాన్స్‌, నాగ్‌పూర్‌ నింజాస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఆధ్యంతం​ ఉత్కంఠభరితంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో వైజాగ్‌ టైటాన్స్‌ పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టైటాన్స్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ (18 బంతుల్లో 27; 6 ఫోర్లు), నిక్‌ కాంప్టన్‌ (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, సిక్స్‌), మల్కన్‌ సింగ్‌ (33 బంతుల్లో 38; 4 ఫోర్లు), స్టువర్ట్‌ బిన్నీ (18 బంతుల్లో 49 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. స్టువర్ట్‌ బిన్నీ ఆకాశమే హద్దుగా చెలరేగి ఎడాపెడా బౌండరీలు సిక్సర్లు బాదాడు.

అనంతరం బరిలోకి దిగిన నింజాస్‌ రిచర్డ్‌ లెవి విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడినప్పటికీ గెలవలేకపోయింది. ఈ ఇన్నింగ్స్‌లో 44 బంతులు ఎదుర్కొన్న లెవి 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. లెవికి మరో ఎండ్‌ నుంచి సహకారం లభించకపోవడంతో నింజాస్‌ ఓటమిపాలైంది. అభిమన్యు ఖోద్‌ (42) పర్వాలేదనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆఖరి ఓవర్‌లో నింజాస్‌ గెలుపుకు 10 పరుగులు అవసరం కాగా.. 8 పరుగులు మాత్రమే వచ్చాయి. ఆఖరి ఓవర్‌ అద్భుతంగా బౌల్‌ చేసిన స్టువర్ట్‌ బిన్నీ.. హర్భజన్‌ సింగ్‌ను కట్టడి చేయగలిగాడు. ఆఖరి బంతికి సిక్సర్‌ అవసరం కాగా, భజ్జీ బౌండరీతో సరిపెట్టుకున్నాడు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)