Breaking News

పోరాడి ఓడిన రాజా ర్వితిక్‌ , లలిత్‌ బాబు

Published on Tue, 11/04/2025 - 07:55

పనాజీ: ప్రపంచకప్‌ పురుషుల చెస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా ర్వితిక్‌... ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ ఎంఆర్‌ లలిత్‌ బాబులకు నిరాశ ఎదురైంది. ఈ ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు తీవ్రంగా పోరాడినా... తొలి రౌండ్‌ అడ్డంకిని దాటలేకపోయారు. నొగెర్‌బెక్‌ కాజీబెక్‌ (కజకిస్తాన్‌)తో జరిగిన తొలి రౌండ్‌లో రాజా ర్వితిక్‌ ‘టైబ్రేక్‌’లో 2–4తో... మాక్స్‌ వార్మెర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌)తో జరిగిన తొలి రౌండ్‌లో లలిత్‌ బాబు ‘టైబ్రేక్‌’లో 2–4తో ఓడిపోయారు. ఆదివారం నిరీ్ణత రెండు క్లాసికల్‌ గేమ్‌ల తర్వాత 1–1తో సమంగా ఉండటంతో... విజేతను నిర్ణయించేందుకు సోమవారం ‘టైబ్రేక్‌’ గేమ్‌లు ఆడించారు. నిబంధనల ప్రకారం ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు నిర్వహించారు. 

నొగెర్‌బెక్‌తో జరిగిన తొలి గేమ్‌లో రాజా ర్వితిక్‌ 42 ఎత్తుల్లో ఓడిపోయాడు. అయితే రెండో గేమ్‌లో ర్వితిక్‌ 52 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో టైబ్రేక్‌లో స్కోరు 1–1తో సమమైంది. దాంతో ఫలితం తేలేందుకు ఈసారి 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లు ఆడించారు. తొలి గేమ్‌లో నొగెర్‌బెక్‌ 43 ఎత్తుల్లో గెలిచి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ రెండో గేమ్‌లో ర్వితిక్‌ 42 ఎత్తుల్లో గెలవడంతో స్కోరు 2–2తో సమమైంది. దాంతో ఈసారి 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడించారు. తొలి గేమ్‌లో ర్వితిక్‌ 71 ఎత్తుల్లో ఓడిపోయాడు.

 బరిలో నిలవాలంటే రెండో గేమ్‌లో ర్వితిక్‌ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రెండో గేమ్‌లో ర్వితిక్‌ 65 ఎత్తుల్లో ఓటమి పాలయ్యాడు. దాంతో నొగెర్‌బెక్‌ టైబ్రేక్‌లో 4–2తో విజయాన్ని అందుకొని రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మరోవైపు వార్మెర్‌డామ్‌తో జరిగిన 15 నిమిషాల నిడివిగల టైబ్రేక్‌ తొలి గేమ్‌లో లలిత్‌బాబు 30 ఎత్తుల్లో నెగ్గాడు. రెండో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నా లలిత్‌ బాబు ముందంజ వేసేవాడు. కానీ రెండో గేమ్‌లో వార్మెర్‌డామ్‌ 40 ఎత్తుల్లో గెలిచి స్కోరును 1–1తో సమం చేశాడు. 

ఇక 10 నిమిషాల నిడివిగల తొలి గేమ్‌లో వార్మెర్‌డామ్‌ 46 ఎత్తుల్లో నెగ్గి 2–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే రెండో గేమ్‌లో లలిత్‌ బాబు 50 ఎత్తుల్లో గెలిచి స్కోరును 2–2తో సమం చేశాడు. ఇక 5 నిమిషాల నిడివిగల తొలి గేమ్‌లో వార్మెర్‌డామ్‌ 47 ఎత్తుల్లో విజయం సాధించి 3–2తో ఆధిక్యాన్ని సంపాదించాడు. బరిలో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన రెండో గేమ్‌లో లలిత్‌ బాబు 61 ఎత్తుల్లో ఓడిపోయాడు. దాంతో వార్మెర్‌డామ్‌ 4–2తో గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ఎస్‌ఎల్‌ నారాయణన్, దీప్తాయాన్‌ ఘోష్‌ టైబ్రేక్‌ ర్యాపిడ్‌ గేముల్లో తమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.    

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)