Breaking News

పీవీ సింధుకు ఘోర పరాభవం.. సెమీ ఫైనల్లో ఓటమి! ఫైనల్లో లక్ష్య సేన్

Published on Sun, 07/09/2023 - 08:27

కెనడా ఓపెన్‌ సెమీ ఫైనల్లో భారత స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధుకు చుక్కెదురైంది. ఆదివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన అకానే యమగుచి చేతిలో 14-21,15-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండు గేమ్స్‌లోనూ సింధుపై యమగుచి అధిపత్యం చెలాయించింది.  కాగా యమగుచి చేతిలో సింధు ఓడిపోవడం వరుసగా ఇది రెండో సారి కావడం గమనార్హం.

సింగపూర్‌ ఓపెన్‌-2023లో తొలిరౌండ్‌లోనే సింధును ఈ జపాన్‌ స్టార్‌ షెట్లర్‌ ఓడించింది. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత సింధు మునుపటిలా ప్రదర్శన చేయలేకపోతోంది. తాజాగా బీడబ్ల్యూఎఫ్‌ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ మూడు స్ధానాలు దిగజారి 15వ ర్యాంక్‌లో సింధు నిలిచింది. 

ఫైనల్లో లక్ష్య సేన్
ఇక పీవీ సింధు నిరాశపరిచినప్పటికీ మరో భారత షెట్లర్‌ లక్ష్య సేన్ మాత్రం అదరగొట్టాడు. కెనడా ఓపెన్‌ ఫైనల్లోకి  లక్ష్య సేన్ అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన కెంటా నిషిత్మోటోను 21-17, 21-14  వరుస గేమ్‌లలో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విజయంతో  లక్ష్య సేన్  దాదాపు ఏడాది తర్వాత బీడబ్ల్యూఎఫ్‌  వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
చదవండి: ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)