Breaking News

లక్ష్య సేన్‌ సంచలనం

Published on Fri, 03/14/2025 - 03:49

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 15వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌  ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–13, 21–10తో ఇండోనేసియా స్టార్, ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీని బోల్తా కొట్టించాడు. లక్ష్య సేన్‌ ధాటికి తట్టుకోలేక జొనాథన్‌ క్రిస్టీ 36 నిమిషాల్లో చేతులెత్తేశాడు. 

ఈ గెలుపుతో గత ఏడాది ఇదే టోర్నీలో సెమీఫైనల్లో క్రిస్టీ చేతిలో ఎదురైన ఓటమికి లక్ష్య సేన్‌ బదులు తీర్చుకున్నాడు. గతంలో క్రిస్టీ చేతిలో నాలుగుసార్లు ఓడిపోయిన లక్ష్య సేన్‌ ఈసారి మాత్రం ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం చలాయించాడు. లక్ష్య ఆటకు జవాబివ్వలేక క్రిస్టీ అనవసర తప్పిదాలు చేశాడు. దాంతో తొలి గేమ్‌లో ఒక్కసారి కూడా ఇద్దరి స్కోర్లు సమం కాలేదు. రెండో గేమ్‌లోనూ లక్ష్య తన దూకుడు కొనసాగించాడు. 

స్కోరు 11–6 వద్ద లక్ష్య సేన్‌ ఒక్కసారిగా చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 17–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరులో రెండో గేమ్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.  నేడు క్వార్టర్‌ ఫైనల్లో  6వ ర్యాంకర్‌ లీషి ఫెంగ్‌ (చైనా)తో లక్ష్య సేన్‌ ఆడతాడు.  

వైదొలిగిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీ 
పురుషుల డబుల్స్‌లో ఏడో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో వెనుదిరిగింది. హావో నాన్‌ జియె–హాన్‌ జెంగ్‌ వె (చైనా)తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సాత్విక్‌–చిరాగ్‌ తొలి గేమ్‌ను 16–21తో కోల్పోయారు. రెండో గేమ్‌లో స్కోరు 2–2 వద్ద ఉన్నపుడు చిరాగ్‌ వెన్ను నొప్పితో ఆటను కొనసాగించలేకపోయాడు. దాంతో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం మ్యాచ్‌ మధ్యలోనే వైదొలిగింది. 

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మాళవిక బన్సోద్‌ (భారత్‌) 16–21, 13–21తో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌) చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గద్దె రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) ద్వయం 10–21, 12–21తో జె ఫెంగ్‌ యాన్‌–జిన్‌ వె యా (చైనా) జంట చేతిలో ఓడిపోయింది.  

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)