Breaking News

నేను ఒత్తిడిలో తప్పులు చేశాను.. అతడు మాత్రం అద్భుతం: ల‌క్ష్య‌సేన్

Published on Tue, 08/06/2024 - 08:49

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ ల‌క్ష్య‌సేన్ పోరాటం ముగిసింది. పురుషుల బ్యాడ్మంట‌న్ సింగిల్స్   సెమీఫైన‌ల్లో ఓట‌మి చ‌విచూసిన ల‌క్ష్య‌సేన్‌.. కాంస్య పతక మ్యాచ్‌లోనూ నిరాశ‌ప‌రిచాడు. సోమ‌వారం జ‌రిగిన కాంస్య ప‌త‌క పోరులో  21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ల‌క్ష్య‌సేన్‌ ఓడిపోయాడు. 

71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్‌ తొలి గేమ్‌ గెల్చుకున్నప్పటికీ అదే జోరును తర్వాత కొనసాగించలేకపోయాడు. దీంతో 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత బ్యాడ్మింటన్‌లో పతకం లేకుండానే భార‌త క్రీడాకారులు ఇంటిముఖం ప‌ట్ట‌డం ఇదే తొలి సారి. 

2012 లండన్‌లో సైనా నెహ్వాల్ కాంస్యం సాధించగా... 2016 రియోలో పీవీ సింధు రజతం, 2020 టోక్యోలో పీవీ సింధు కాంస్యం గెలిచారు. ఇక ఈ ఓట‌మిపై మ్యాచ్ అనంత‌రం లక్ష్య‌సేన్ స్పందించాడు.

"ఏం తప్పు జరిగిందో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నాను. నేను మ్యాచ్‌ను బాగా మొదలు పెట్టినా దానిని కొనసాగించలేకపోయాను. ఫలితంతో చాలా నిరాశ చెందాను. గత మ్యాచ్, ఈ మ్యాచ్‌లను ఎలా పోల్చాలో కూడా అర్థం కావడం లేదు. రెండూ కీలక మ్యాచ్‌లే. కానీ రెండూ ఓడిపోయాను.

కీలక దశలో ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను చాలా తప్పులు చేశాను. నా ప్రత్యర్థి రెండో గేమ్‌ నుంచి అద్భుతంగా పుంజుకున్నాడు. కుడి చేతికి గాయంతో కొంత రక్తం రావడంతో మధ్యలో ఆటను ఆపి చికిత్స చేయించుకోవాల్సి వచి్చంది. అయితే మ్యాచ్‌ ఫలితానికి దీనికి సంబంధం లేదని ల‌క్ష్య‌సేన్ పేర్కొన్నాడు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)