Breaking News

శ్రీకాంత్‌ అవుట్‌

Published on Fri, 01/23/2026 - 03:49

జకార్తా: ఇండోనేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. 

గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో లక్ష్య సేన్‌ 21–10, 21–11తో జేసన్‌ గుణవాన్‌ (హాంకాంగ్‌)పై గెలుపొందగా... శ్రీకాంత్‌ 11–21, 10–21తో నాలుగో సీడ్‌ చౌ టియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ అన్‌మోల్‌ ఖరబ్‌ 21–16, 14–21, 11–21తో ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయింది. 

పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హరిహరన్‌–అర్జున్‌ (భారత్‌) ద్వయం 17–21, 21–9, 16–21తో మాన్‌ వె చోంగ్‌–కాయ్‌ వున్‌ టీ (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. నేడు జరిగే సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో పానిత్‌చపోన్‌ (థాయ్‌లాండ్‌)తో లక్ష్య సేన్‌; చెన్‌ యు ఫె (చైనా)తో పీవీ సింధు తలపడతారు. ముఖాముఖి రికార్డులో లక్ష్య సేన్‌ 1–0తో పానిత్‌చపోన్‌పై ఆధిక్యంలో ఉండగా... సింధు 6–7తో చెన్‌ యు ఫె చేతిలో వెనుకబడి ఉంది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)