Breaking News

క్వార్టర్స్‌లో ఓడిన లక్ష్యసేన్‌ 

Published on Sat, 01/17/2026 - 06:03

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. ఒకే ఒక్కడు లక్ష్యసేన్‌ మాత్రమే క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... అతనూ అంతకుమించి ముందంజ వేయలేకపోయాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో  లక్ష్యసేన్‌ 21–17, 13–21, 18–21తో చైనీస్‌ తైపీ ప్లేయర్‌ లిన్‌ చున్‌ యి చేతిలో పరాజయం చవిచూశాడు. 2021 ప్రపంచ చాంపియíÙప్‌ కాంస్య పతక విజేత అయిన లక్ష్యసేన్‌ ప్రిక్వార్టర్స్‌లో 21–19, 21–10తో జపాన్‌ ఆటగాడు కెంట నిషిమొతోపై అలవోక విజయం సాధించాడు.  

సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, హెచ్‌.ఎస్‌.ప్రణయ్, మాళవిక బన్సోద్‌ గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లలో పరాజయంపాలయ్యారు. పురుషుల సింగిల్స్‌లో క్రిస్టో పొపొవ్‌ (ఫ్రాన్స్‌)తో జరిగిన పోరులో శ్రీకాంత్‌ 14–21, 21–17, 17–21తో ఐదో సీడ్‌ ఫ్రాన్స్‌ ప్లేయర్‌ ధాటికి పరాజయం చవిచూశాడు. ప్రణయ్‌ కూడా 21–18, 19–21, 14–21తో ఎనిమిదో సీడ్‌ లోహ్‌ కియన్‌ యూ (సింగపూర్‌) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో మాళవిక బన్సోద్‌ 18–21, 15–21తో చైనాకు చెందిన ఐదో సీడ్‌ హన్‌ యూవ్‌ చేతిలో ఓడిపోయింది. మహిళల డబుల్స్‌ రెండో రౌండ్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జంట 22–20, 22–24, 21–23తో ఏడో సీడ్‌ లి యిజింగ్‌–లూయో జుమిన్‌ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది.  

వివాదాస్పద నిర్ణయంతో.... 
పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్లో మూడో సీడ్‌ సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 27–25, 21–23, 19–21తో ప్రపంచ 22వ ర్యాంకు జోడీ హిరోకి మిదొరికవ–క్యోహే యామషిత (జపాన్‌) చేతిలో ఓడింది. భారత, జపాన్‌ జోడీలు అప్పటికే చెరో గేమ్‌ గెలిచాయి. నిర్ణాయక గేమ్‌లో హోరీహోరీగా తలపడుతున్నాయి. ఇలాంటి దశలో స్కోరు 15–15 వద్ద  దురదృష్టవశాత్తు నెట్‌కు సాత్విక్‌ తగిలాడు. దీంతో చైర్‌ అంపైర్‌ ప్రత్యర్థి జోడీకి పాయింట్‌ ఇచ్చాడు. వెంటనే దీనిపై అంపైర్‌కు సాత్విక్‌ వివరణ ఇచ్చాడు. చిరాగ్‌ వీడియో రిఫరల్‌ను పరిశీలించాలని కోరాడు. కానీ చైర్‌ అంపైర్‌ తన నిర్ణయానికే కట్టుబడి ఉండటంతో ఇది భారత జోడీ తిరిగి పుంజుకోకుండా చేసింది. ప్రతీ గేమ్‌లోనూ అసాధారణ పోరాటపటిమ కనబరిచిన అగ్రశ్రేణి భారత ద్వయం ఇంత జరిగినా కూడా తమ పరాజయానికి సాకుగా ఈ ప్రతికూలతను చెప్పనేలేదు. కీలకమైన సమయంలో ప్రత్యర్థి జోడీనే తమకన్నా మిన్నగా పాయింట్లు సాధించడం వల్లే ఓడిపోయామని సాత్విక్‌ జంట మ్యాచ్‌ ముగిసిన అనంతరం వెల్లడించింది.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)