Breaking News

వరుసగా 24వ ఏడాది టైటిల్‌ లేకుండానే...

Published on Sat, 03/15/2025 - 03:56

బర్మింగ్‌హామ్‌: ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ నుంచి వరుసగా 24వ ఏడాది భారత క్రీడాకారులు టైటిల్‌ లేకుండానే తిరిగి రానున్నారు. భారత్‌ నుంచి ఐదు విభాగాల్లో కలిపి మొత్తం 17 మంది క్రీడాకారులు ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగగా... ఒక్కరు కూడా క్వార్టర్‌ ఫైనల్‌ దాటి ముందుకెళ్లలేకపోయారు. సంచలన విజయాలతో ఆశలు రేకెత్తించిన లక్ష్య సేన్, పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. 

శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 15వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 10–21, 16–21తో ఆరో ర్యాంకర్‌ లీ షి ఫెంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)ను ఓడించిన లక్ష్య సేన్‌ క్వార్టర్‌ ఫైనల్లో అదే ఫలితాన్ని పునరావృతం చేయడంలో విఫలమయ్యాడు.   

మహిళల డబుల్స్‌లో 2022, 2023లలో సెమీఫైనల్‌ చేరిన పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్‌) జోడీ ఈసారి క్వార్టర్‌ ఫైనల్లో 14–21, 10–21తో రెండో సీడ్‌ లియు షెంగ్‌షు–టాన్‌ నింగ్‌ (చైనా) జంట చేతిలో ఓడింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి–ట్రెసా జోడీ 15–21, 21–18, 21–18తో ఎనిమిదో సీడ్‌ కిమ్‌ హై జియోంగ్‌–కాంగ్‌ హీ యోంగ్‌ (కొరియా) జంటను ఓడించిది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన లక్ష్య సేన్‌కు 7,975 డాలర్లు (రూ. 6 లక్షల 93 వేలు)... గాయత్రి–ట్రెసాలకు 9,062 డాలర్లు (రూ. 7 లక్షల 87 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి.  

2 గతంలో భారత్‌ నుంచి ప్రకాశ్‌ పదుకొనే (1980లో), పుల్లెల గోపీచంద్‌ (2001లో) మాత్రమే ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌లో టైటిల్స్‌ సాధించారు. 2015లో సైనా నెహ్వాల్, 2022లో లక్ష్య సేన్‌ ఫైనల్‌ చేరుకున్నా రన్నరప్‌ ట్రోఫీలతో సరిపెట్టుకున్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)