ఆసీస్‌ పేసర్‌ సూపర్‌ డెలివరీ.. భరత్‌కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్‌

Published on Sat, 06/10/2023 - 09:27

ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ తీవ్ర నిరాశపరిచాడు. పంత్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన భరత్‌.. వికెట్‌ కీపింగ్‌ పరంగా పర్వాలేదనిపించినప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం అకట్టుకోలేకపోయాడు. మూడో రోజు ఆటలో అజింక్య రహానేకు భరత్‌ సపోర్ట్‌గా నిలుస్తాడని అంతా భావించారు. కానీ ఆటప్రారంభమైన కొద్దిసేపటికే భరత్‌ 5 పరుగులు చేసి స్కాట్‌ బోలాండ్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

భరత్‌ను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో బోలాండ్‌ బోల్తా కొట్టించాడు. బోలాండ్‌ వేసిన డెలివరీకి భరత్‌ ఢిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి అద్బుతంగా టర్న్‌ అయ్యి మిడిల్‌ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో భరత్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని కొనసాగుతోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్ (41 పరుగులు), కామెరూన్ గ్రీన్ (7 పరుగులు) ఉన్నారు.

అంతకముందు భారత తమ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానే, (89 పరుగులు), ఆల్‍రౌండర్ శార్దూల్ ఠాకూర్ (51 పరుగులు) రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోర్‌నైనా అందుకుంది. ఇక మొత్తంగా ఆస్ట్రేలియా 296 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: WTC Final: బాలయ్య డైలాగులు చెప్పిన స్టీవ్‌ స్మిత్‌.. వీడియో వైరల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)