Breaking News

RCBvPBKS: చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా.. 18 ఏళ్లలో ఒకే ఒక్కడు

Published on Wed, 06/04/2025 - 10:51

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) చ‌రిత్ర‌లో సరికొత్త ఛాంపియ‌న్ అవ‌త‌రించింది. ఐపీఎల్‌-2025 సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) నిలిచింది. అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్‌లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. త‌మ 18 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించింది.

ఈ తుది పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 190 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(43) టాప్ స్కోర‌ర్‌గా నిలవ‌గా.. పాటిదార్‌(26), జితేష్ శ‌ర్మ‌(24), లివింగ్ స్టోన్‌(25) రాణించారు. పంజాబ్ బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్‌, జామీస‌న్ త‌లా మూడు వికెట్లు ప‌డ‌గొట్టారు.

తిప్పేసిన కృనాల్‌..
అనంతరం లక్ష్య చేధనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగల్గింది. శశాంక్ సింగ్‌(61) ఆఖరి వరకు పోరాడినప్పటికి తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చాడు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు.

తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. పాండ్యా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగుల మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. పాండ్యా ఆసాధరణ ప్రదర్శనకు గాను ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌​ అవార్డు దక్కింది.

తద్వారా కృనాల్‌​ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ ఫైనల్లో రెండుసార్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచిన తొలి ఆటగాడిగా కృనాల్‌ పాండ్యా రికార్డుల్లోకెక్కాడు. 2017లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్స్‌పై ముంబై ఇండియన్స్‌ విజయం సాధించిన సందర్భంలోనూ కృనాల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.
చదవండి: Virat Kohli On RCB Win: ఈ రోజు వస్తుందని అనుకోలేదు.. ప్రశాంతంగా నిద్రపోతా

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)