Breaking News

‘భారీ విజయాలపై ఇంగ్లండ్‌ దృష్టి పెట్టాలి.. లేదంటే కష్టమే'

Published on Sun, 10/15/2023 - 07:26

వన్డే ప్రపంచకప్‌-2023లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ మరో విజయంపై కన్నేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్‌ ఇంగ్లండ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 

"డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌కు ఆదివారం అఫ్గానిస్తాన్‌తో పెద్దగా సవాలైతే ఎదురుకాదు. ఢిల్లీలో అఫ్గాన్‌ స్పిన్నర్లకు పిచ్‌ నుంచి సానుకూలత లేకపోతే మ్యాచ్‌ ఏకపక్షమయ్యే ఫలితంలో ఏ మార్పు ఉండదు. ఈ నేపథ్యంలో నేడు అరుణ్‌ జైట్లీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పొచ్చు. అయితే గాయం నుంచి కోలుకున్న బెన్‌ స్టోక్స్‌ బరిలోకి దిగేందుకు, ఫామ్‌ను అందిపుచ్చుకునేందుకు ఈ మ్యాచ్‌ ఉపయోగపడుతుంది.

ఇంగ్లండ్‌కు ఈ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఫిట్‌నెస్‌ ఎంతో కీలకం. ఏడాది క్రితం వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టోక్స్‌ ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఫార్మాట్‌ లో పునరాగమనం చేశాడు. 50 ఓవర్ల మ్యాచ్‌లో అతను ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడని ఇదివరకు ఎన్నో సార్లు రుజువు చేశాడు.

మరోవైపు దక్షిణాఫ్రికా చేతిలో ఆ్రస్టేలియా చిత్తుగా ఓడటం ఇంగ్లండ్‌ సహా సెమీస్‌ బరిలో ఉంటామనుకున్న మిగతా జట్ల ఉత్సాహంపై నీళ్లుచల్లింది. ఎందుకంటే ఇంగ్లండ్‌ కూడా న్యూజిలాండ్‌ చేతిలో అలాంటి పరాజయాన్నే చవిచూసింది. ఇలాంటి అత్యల్ప స్కోర్ల మ్యాచ్‌లతో నాకౌట్‌ దశ చేరేందుకు చివరికొచ్చేసరికి రన్‌రేట్‌ కీలకమవుతుంది.

కాబట్టి సెమీస్‌లో ఎవరూ ఖాయమని అనుకోవడానికి లేదు. అయితే ఇంగ్లండ్‌... అఫ్గాన్‌ తదితర జట్లపై భారీ విజయాలపై దృష్టి పెడితే మంచిది. ఢిల్లీ లాంటి పిచ్‌పై ఇంగ్లండ్‌ బ్యా టర్లు చెలరేగేందుకు చక్కని అవకాశం కలి్పస్తుంది.
చదవండి: విలియమ్సన్‌కు గాయం: మూడు మ్యాచ్‌లకు దూరం

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)