Breaking News

కోనేరు హంపి శుభారంభం

Published on Sun, 07/20/2025 - 04:02

బతుమి (జార్జియా): ‘ఫిడే’ మహిళల ప్రపంచ కప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి సెమీఫైనల్‌కు చేరువైంది. శనివారం యుజిన్‌ సాంగ్‌ (చైనా)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ తొలి గేమ్‌లో హంపి విజయం సాధించింది. హంపి 53 ఎత్తుల్లో ప్రత్యర్థి ఆట కట్టించింది. ఈ పోరులో ఇద్దరి మధ్య జరిగే రెండో గేమ్‌ను హంపి ‘డ్రా’గా ముగించుకున్నా సరే సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. 

మరో క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో ఇద్దరు భారత ప్లేయర్లు ద్రోణవల్లి హారిక, దివ్య దేశ్‌ముఖ్‌ తలపడగా... తొలి గేమ్‌ ‘డ్రా’గా ముగిసింది. 31 ఎత్తుల తర్వాత ఇద్దరు ప్లేయర్లు సమ ఉజ్జీలుగా నిలిచారు. క్వార్టర్‌ ఫైనల్‌ బరిలో నిలిచిన మరో భారత ప్లేయర్‌ ఆర్‌. వైశాలి కూడా తన తొలి గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. 

వైశాలి, టాన్‌ జోంగీ (చైనా) మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరు 72 ఎత్తుల వరకు సాగి సమంగా ముగిసింది. హారిక, దివ్య మధ్య... వైశాలి, టాన్‌ జోంగీ మధ్య రెండో గేమ్‌లో ఎవరు గెలిస్తే వారు సెమీస్‌ చేరతారు. నాలుగో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ తొలి గేమ్‌లో టింగ్‌జీ లీ (చైనా) తొలి గేమ్‌లో 40 ఎత్తుల్లో స్థానిక ప్లేయర్‌ జాగ్‌నిడ్జ్‌ నానా (జార్జియా)ను ఓడించింది.   

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)