Breaking News

‘మళ్లీ నా సమయం వచ్చింది’

Published on Fri, 04/25/2025 - 03:09

పుణే: క్లాసికల్‌ ఫార్మాట్‌లో మెరుగైన ప్రదర్శన చేయడం ఆనందంగా ఉందని... భారత గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి పేర్కొంది. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ ఐదో అంచె టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి హంపి విజేతగా నిలిచింది. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో చైనా గ్రాండ్‌మాస్టర్‌ జు జినెర్‌తో కలిసి హంపి 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. అయితే నల్లపావులతో ఎక్కువ గేమ్‌లు ఆడినందుకు హంపికి టైటిల్‌ దక్కింది. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ స్పందిస్తూ... ‘క్లాసికల్‌లో మెరుగైన ప్రదర్శన చేయక చాలా రోజులైంది. 

గతేడాది మొత్తం ఈ ఫార్మాట్‌లో నా తడబాటు సాగింది. దీంతో ఎన్నో పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చిoది. అందుకే ఇందులో టైటిల్‌ గెలవడం ఆనందాన్ని పెంచింది. ర్యాపిడ్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలిచినప్పటి నుంచి నా ఆటతీరు మెరుగైంది. తిరిగి నా టైమ్‌ వచ్చినట్లు అనిపిస్తోంది. రెండోసారి ర్యాపిడ్‌ టైటిల్‌ సాధించిన అనంతరం నాలో కొత్త ఉత్తేజం వచ్చింది. చిన్నప్పుడు ఆడిన ఆటకు ఇప్పుడు ఆడుతున్న ఆటకు చాలా తేడా ఉంది. ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దానికి తగ్గట్లు మనం కూడా మారాలి. 

నాకంటే దాదాపు 20 ఏళ్లు చిన్నదైన ప్రత్యర్థితో పోటీపడి గెలవడం బాగుంది’ అని వెల్లడించింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోని 38 ఏళ్ల హంపి... క్యాండిడేట్స్‌ టోర్నీకి ఎంపిక గురించి పెద్దగా ఆలోచించడం లేదని చెప్పింది. ప్రస్తుతానికి అమెరికా, నార్వేలో జరగనున్న టోర్నీలపైనే దృష్టి పెట్టినట్లు వెల్లడించింది. సాధారణంగా దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులను పడగొట్టే హంపి... తాజా టోర్నీలో మాత్రం ఆచితూచి ఆడింది. వివాదాలకు దూరంగా ఉండే... హంపికి సరైన సపోర్టింగ్‌ వ్యవస్థ ఉంటే మరిన్ని ఫలితాలు సాధిస్తుందని పుణే గ్రాండ్‌మాస్టర్‌ అభిజీత్‌ కుంటే అభిప్రాయపడ్డాడు. 

కెరీర్‌లో లెక్కకు మిక్కిలి టైటిల్స్‌ గెలిచిన హంపి క్యాండిడేట్స్‌ ప్రపంచ టైటిల్‌ మాత్రం ఒడిసి పట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో అభిజీత్‌ మాట్లాడుతూ.. ‘హంపీ చాలా చక్కగా ఆడుతోంది. ఆమె ఆటలో ఆత్మవిశ్వాసం ఎక్కువ. చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. కానీ ప్రపంచ టైటిల్‌ సాధించేందుకు ఇదొక్కటే సరిపోదు. నిష్ణాతులైన బృందం ఆమెకు తోడ్పాటు అందించాలి. ఇప్పుడు ఆమె ఆటతీరు బాగలేదని కాదు కానీ... బలమైన మెంటారింగ్‌ అవసరం’ అని అన్నాడు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)