Breaking News

బీబీసారా చేతిలో హంపి ఓటమి

Published on Mon, 11/04/2024 - 04:04

షిమ్‌కెంట్‌ (కజకిస్తాన్‌): అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) మహిళల గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ క్రీడాకారిణి కోనేరు హంపికి తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ హంపి 34 ఎత్తుల్లో కజకిస్తాన్‌కు చెందిన అసబయేవా బీబీసారా చేతిలో ఓడిపోయింది. 

పది మంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది. భారత్‌కే చెందిన జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌తో జరిగిన తొలి గేమ్‌ ను 41 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హంపి... టాన్‌ జోంగి (చైనా)తో జరిగిన రెండో గేమ్‌ను 70 ఎత్తుల్లో  ‘డ్రా’గా ముగించింది. 

మున్‌గున్‌తుల్‌ (మంగోలియా)తో జరిగిన మూడో గేమ్‌లో హంపి 45 ఎత్తుల్లో గెలిచింది. సలీమోవా (బల్గేరియా)తో జరిగిన నాలుగో గేమ్‌లో హంపి 64 ఎత్తుల్లో నెగ్గింది. ఐదో రౌండ్‌ తర్వాత హంపి 3 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా 3వ స్థానంలో ఉంది. 

దివ్య గెలుపు బోణీ 
భారత రైజింగ్‌ స్టార్‌ దివ్య దేశ్‌ముఖ్‌ ఐదో రౌండ్‌లో గెలుపు బోణీ కొట్టింది. మున్‌గున్‌తుల్‌ (మంగోలియా)తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌లో దివ్య 45 ఎత్తుల్లో నెగ్గింది. హంపితో తొలి రౌండ్‌ గేమ్‌ను ‘డ్రా’గా ముగించిన దివ్య... కాటరీనా లాగ్నోతో జరిగిన రెండో గేమ్‌ను కూడా ‘డ్రా’ చేసుకుంది. అలెగ్జాండ్రా గొర్యాక్‌చినా (రష్యా)తో జరిగిన మూడో గేమ్‌లో దివ్య 40 ఎత్తుల్లో ఓడిపోయింది. టాన్‌ జోంగి (చైనా)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ను దివ్య 41 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. 

#

Tags : 1

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)