Breaking News

అందరి చూపు కోహ్లి వైపు

Published on Thu, 01/30/2025 - 03:36

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్‌లో టన్నులకొద్దీ పరుగులు చేసిన భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి 2012 తర్వాత దేశవాళీ బాట పట్టాడు. రంజీ ట్రోఫీ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆడేందుకు కోహ్లి సిద్ధమయ్యాడు. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా రైల్వేస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న పోరులో కోహ్లి ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు.

గ్రూప్‌ దశలో ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క దాంట్లోనే గెలిచిన ఢిల్లీ జట్టుకు నాకౌట్‌ చేరే అవకాశాలు పెద్దగా లేకపోయినా... కోహ్లి బరిలోకి దిగుతుండటంతో ఫలితంతో సంబంధం లేకుండా ... తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు భారీగా అభిమానులు మైదానానికి తరలి రానున్నారు. 

గత ఆరో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఆడిన భారత క్రికెటర్లు రిషభ్‌ పంత్, రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్‌ తదితరులు ఆకట్టుకోలేకపోగా... ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ముందు కోహ్లి భారీ ఇన్నింగ్స్‌ ఆడితే చూడాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి కాగా... ఢిల్లీ జట్టుకు ఆయుశ్‌ బదోనీ సారథ్యం వహిస్తున్నాడు. ‘ఐపీఎల్‌లో కోహ్లీకి ప్రత్యర్థిగా ఆడాను. 

ఇప్పుడు నా నాయకత్వంలో వరుస మ్యాచ్‌ల్లో పంత్, కోహ్లి లాంటి దిగ్గజాలు ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. కోహ్లి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌ చేస్తాడు. అనవసర ఒత్తిడికి లోను కాకుండా స్వేచ్ఛగా ఆడమని కోహ్లి మాకు సూచించాడు’ అని బదోనీ అన్నాడు.  

కేఎల్‌ రాహుల్‌ కఠోర సాధన 
చాన్నాళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగనున్న భారత ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బుధవారం ప్రాక్టీస్‌ సెషన్‌ లో పాల్గొన్నాడు. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా నేటి నుంచి బెంగళూరులో హరియాణా జట్టుతో తలపడనున్న కర్ణాటక జట్టులో రాహుల్‌ బరిలోకి దిగనున్నాడు. 

నెట్‌ సెషన్‌లో తీవ్రంగా శ్రమించిన రాహుల్‌... స్పిన్, పేస్‌ అనే తేడా లేకుండా అందరి బౌలింగ్‌లోనూ సుదీర్ఘంగా ప్రాక్టీస్‌ చేశాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో స్థానం దక్కించుకున్న రాహుల్‌... ఈ మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసి తన జట్టును రంజీ ట్రోఫీలో నాకౌట్‌ దశకు చేర్చాలని భావిస్తున్నాడు.  

సిరాజ్‌ పాత బంతితో ప్రాక్టీస్‌ 
గత మ్యాచ్‌లో స్టార్‌ ఆటగాళ్లతో బరిలోకి దిగి కూడా జమ్మూ కశ్మీర్‌ జట్టు చేతిలో ఓటమి పాలైన ముంబై జట్టు... ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’ చివరి లీగ్‌ మ్యాచ్‌లో మేఘాలయాతో పోరుకు సిద్ధమైంది. రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ విజేతగా నిలిచిన ముంబై నాకౌట్‌ చేరాలంటే ఈ మ్యాచ్‌లో బోనస్‌ పాయింట్‌ విజయం సాధించడంతో పాటు ... ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా అనుకూలించాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ నేపథ్యంలో రోహిత్, యశస్వి, శ్రేయస్‌ అయ్యర్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నారు. మరి రహానే సారథ్యంలోని ముంబై టీమ్‌ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో చూడాలి.  ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా విదర్భతో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున మొహమ్మద్‌ సిరాజ్‌ బరిలోకి దిగనున్నాడు. 

ఈ గ్రూప్‌ నుంచి విదర్భ ఇప్పటికే నాకౌట్‌ బెర్త్‌ దక్కించు కోగా... హైదరాబాద్‌కు అవకాశాలు లేవు. అయితే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన హైదరాబాదీ సిరాజ్‌ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడనేది కీలకం. 

పాత బంతితో సిరాజ్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోతుండటంతోనే అతడిని ఎంపిక చేయలేదని రోహిత్‌ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో... ప్రాక్టీస్‌లో ఈ హైదరాబాదీ మెరుపు తగ్గిన బంతితో సాధన చేశాడు. గ్రూప్‌ ‘బి’లోనే ఉన్న ఆంధ్ర జట్టు విజయనగరం వేదికగా రాజస్తాన్‌తో ఆడనుంది.   

Videos

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

ABN రాధాకృష్ణ... నీ ఫామ్ హౌస్ బాగోతం.. కారుమూరి సంచలన కామెంట్స్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్