Breaking News

కోహ్లి ఇక ఆడకపోవచ్చు: సౌతాఫ్రికా దిగ్గజం

Published on Thu, 07/11/2024 - 17:03

టీమిండియా హెడ్‌ కోచ్‌గా గౌతం గంభీర్‌ నియామకం పట్ల సౌతాఫ్రికా మాజీ ఆటగాళ్లు జాక్వెస్‌ కలిస్‌, డేల్‌ స్టెయిన్‌ హర్షం వ్యక్తం చేశారు. దూకుడైన ఆటకు మారుపేరైన గౌతీ శిక్షకుడిగా కూడా ఆకట్టుకోగలడని ధీమా వ్యక్తం చేశారు.

కాగా భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో అతడి స్థానాన్ని బీసీసీఐ గంభీర్‌తో భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి మంగళవారం అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.

శ్రీలంకతో జూలై 26 నుంచి మొదలుకానున్న ద్వైపాక్షిక సిరీస్‌ నుంచి ఈ మాజీ ఓపెనర్‌ కోచ్‌గా తన ‍ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. అయితే, గంభీర్‌ రాకతో సీనియర్‌ ఆటగాళ్లకు ఇబ్బందులు తప్పవని.. భావి జట్టును తీర్చిదిద్దే క్రమంలో అతడు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశం
ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సహా రవీంద్ర జడేజా వంటి సీనియర్ల పట్ల గౌతీ కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోకపోతే ఎంతటివారినైనా పక్కనపెట్టేందుకు గంభీర్‌ వెనుకాడడని పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్‌ డేల్‌ స్టెయిన్‌ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్‌ను నేను వీరాభిమానిని. అతడి దూకుడైన స్వభావం నాకెంతో ఇష్టం.

కోహ్లి ఇక ఆడకపోవచ్చు
నేను ఎదుర్కొన్న అత్యంత దూకుడైన భారత ఆటగాళ్లలో అతడూ ఒకడు. డెస్సింగ్‌ రూంలోనూ అలాంటి వాతావరణమే ఉండాలని కోరుకుంటాడు.

నాకు తెలిసి విరాట్‌ కోహ్లి వంటి కొంత మంది సీనియర్లు ఇక ఎక్కువ కాలం జట్టులో కొనసాగకపోవచ్చు. వాళ్లను పూర్తిగా పక్కన పెడతాడని చెప్పలేను కానీ.. కచ్చితంగా కఠినంగానే ఉంటాడనిపిస్తోంది’’ అని డేల్‌ స్టెయిన్‌ అభిప్రాయపడ్డాడు.

ఇక జాక్వెస్‌ కలిస్‌ స్పందిస్తూ.. ‘‘గంభీర్‌ది క్రికెటింగ్‌ బ్రెయిన్‌. సరికొత్త వ్యూహాలు రచించగలడు. జట్టులో జోష్‌ నింపుతాడు. దూకుడుగా ఆడటం తనకు ఇష్టం. జట్టును కూడా అలాగే తయారు చేస్తాడు’’ అని పేర్కొన్నాడు.

చదవండి: WCL 2024: యువరాజ్‌ మళ్లీ ఫెయిల్‌.. యూసఫ్‌, ఇర్ఫాన్‌ మెరుపులు!

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు