Breaking News

అందుకే ఆ రెండు నెలలు అక్కడే ఉన్నాం: కోహ్లి

Published on Tue, 03/26/2024 - 16:00

రెండు నెలల పాటు ఆటకు దూరంగా.. కుటుంబానికి దగ్గరగా ఉండటం వింత అనుభూతినిచ్చిందని టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. తన ఇద్దరు పిల్లలతో కలిసి గడిపిన మధుర క్షణాలు వెలకట్టలేనివని పేర్కొన్నాడు. 

ఇప్పుడిక మళ్లీ ఆట మొదలుపెట్టానన్న కోహ్లి.. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు విరాట్‌ కోహ్లి దూరమైన విషయం తెలిసిందే.

తన భార్య అనుష్క శర్మ ప్రసవం నేపథ్యంలో సెలవు తీసుకున్న ఈ రన్‌మెషీన్‌.. ఫిబ్రవరి 15న తమకు కుమారుడు జన్మించాడని ప్రకటించాడు. పిల్లాడికి అకాయ్‌గా నామకరణం చేసినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌-2024 ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు ఈ ఆర్సీబీ(రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు) బ్యాటర్‌.

సీఎస్‌కేతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కేవలం 21 పరుగులకే పరిమితమైన కోహ్లి..  సోమవారం నాటి మ్యాచ్‌లో మాత్రం అదరగొట్టాడు. పంజాబ్‌ కింగ్స్‌తో బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఆర్సీబీని గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఆ రెండు నెలల పాటు సాధారణ జీవితం గడిపే అవకాశం వచ్చింది. అప్పుడు మేము మన దేశానికి దూరంగా.. రోడ్డు మీద నడుస్తున్నా మమ్మల్ని ఎవరూ గుర్తుపట్టని ప్రదేశంలో ఉన్నాం. కుటుంబమంతా కలిసే ఉన్నాం. అదొక వింతైన అనుభూతి.

ఇద్దరు పిల్లలు ఉన్నపుడు వారితో గడిపే సమయాన్ని కూడా పెంచుకోవాలి కదా! ఏదేమైనా ఆ రెండు నెలలు మొత్తంగా ఫ్యామిలీతో ఉండేందుకు అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 

ఆ మధురానుభూతులను అస్సలు మర్చిపోలేను. ఇప్పుడిక ఆట మొదలైంది. కచ్చితంగా నా బెస్ట్‌ ఇస్తానని ప్రామిస్‌ చేస్తున్నా’’ అని కోహ్లి పేర్కొన్నాడు. మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ అనంతరం ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా ఆర్సీబీ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తలపడనుంది. కాగా కోహ్లి- అనుష్క శర్మ దంపతులకు తొలి సంతానంగా కూతురు వామిక జన్మించిన సంగతి తెలిసిందే.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)