Breaking News

కోబీ బ్రయాంట్‌ జెర్సీకి రూ. 59 కోట్లు

Published on Sat, 04/26/2025 - 19:50

న్యూయార్క్‌: అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం, దివంగత కోబీ బ్రయాంట్‌ ఎన్‌బీఏ అరంగేట్ర మ్యాచ్‌లో వేసుకున్న జెర్సీ రికార్డు ధరకు అమ్ముడైంది. నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) తొలి పోరులో బ్రయాంట్‌ ధరించిన జెర్సీ... శుక్రవారం నిర్వహించిన వేలంలో 70 లక్షల డాలర్ల (రూ. 59 కోట్ల 76 లక్షలు)కు అమ్ముడైంది.

ఎన్‌బీఏ చరిత్రలో గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోబీ... 2020లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ఘటనలో బ్రయాంట్‌ కూతురు గియానాతో పాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌బీఏలో భాగంగా బ్రయాంట్‌ 1996–97 సీజన్‌లో లాస్‌ ఏంజెలిస్‌ లేకర్స్‌ తరఫున అరంగేట్రం చేశాడు. 2007–08 సీజన్‌లో మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డు గెలుచుకున్న సందర్భంలో... బ్రయాంట్‌ సంతకం చేసిన జెర్సీ గతంలో 5.85 మిలియన్‌ డాలర్ల (రూ. 49 కోట్ల 93 లక్షల)కు అమ్ముడుపోగా... ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.

18 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్‌ ఆడిన కోబీ 8వ నంబర్‌ జెర్సీతో బరిలోకి దిగి... ఆరు నిమిషాల పాటు ఆడి ఖాతా తెరువలేకపోయాడు. ‘ఈ జెర్సీ ఓ కుర్రాడి సహజసిద్ధ సామర్థ్యానికి, ఆ తర్వాత దిగ్గజ ప్రస్థానానికి మధ్య వారధి. ఒక లెజెండ్‌కు చెందిన అరుదైన, అసాధారణ వస్తువు’ అని వేలం నిర్వహించిన సోథెబైస్‌ సంస్థ వెల్లడించింది. 

ఓవరాల్‌గా క్రీడాకారుల జెర్సీల వేలంలో... బేబ్‌ రూత్‌ జెర్సీ (24 మిలియన్‌ డాలర్లు), మైకేల్‌ జోర్డాన్‌ ఎన్‌బీఏ జెర్సీ (10.1 మిలియన్‌ డాలర్లు), డీగో మారడోనా అర్జెంటీనా జెర్సీ (9.3 మిలియన్‌ డాలర్ల) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు