Breaking News

ఏంటి రాహుల్‌.. మరీ ఇంత చెత్తగా అవుటవుతావా? వీడియో వైర‌ల్‌

Published on Fri, 11/08/2024 - 14:50

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ త‌న పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదిక‌గా ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-ఎ జ‌ట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న రాహుల్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే చేసిన రాహుల్‌.. ఇప్పుడు కీల‌క‌మైన సెకెండ్ ఇన్నింగ్స్‌లో అదే తీరును క‌న‌బ‌రిచాడు. 44 బంతులు ఎదుర్కొని కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్‌ వినూత్న రీతిలో త‌న వికెట్‌ను కోల్పోయాడు.

అసలేం జ‌రిగిందంటే?
భార‌త్ ఇన్నింగ్స్ 18 ఓవ‌ర్ వేసిన స్పిన్నర్ కోరి రోకిసియోలి తొలి బంతిని రాహుల్‌ ఓవ‌ర్ ది వికెట్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడాల‌ని రాహుల్ నిర్ణ‌యించుకున్నాడు. కానీ బంతి లెగ్ సైడ్ నుండి టర్న్‌ అవుతుండడంతో రాహుల్ త‌న ప్యాడ్ల‌తో డిఫెండ్‌కు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి రాహుల్ కాళ్ల మధ్య నుంచి వెళ్లి బెయిల్స్‌ను గిరాటేసింది. 

దీంతో రాహుల్‌ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంటి రాహుల్‌ ఇంత చెత్తగా అవుటవుతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌-ఎ జట్టు 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. క్రీజులో ధ్రువ్‌ జురెల్‌(19), నితీష్‌ కుమార్‌ రెడ్డి(9) పరుగులతో ఉన్నారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)