కేకేఆర్‌ వద్దన్నోడిని ఎస్‌ఆర్‌హెచ్‌ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా?

Published on Fri, 04/14/2023 - 18:32

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి(48 బంతుల్లో 74 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో రాణించి ఎస్‌ఆర్‌హెచ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇవాళ(శుక్రవారం) ఈడెన్‌ గార్డెన్స్‌ వేదివగా కేకేఆర్‌తో ఎస్‌ఆర్‌హెచ్‌ తలపడనుంది.

అయితే ఇదే రాహుల్‌ త్రిపాఠి 2020 మెగావేలంలో కేకేఆర్‌ రూ.60 లక్షల కనీస ధరకే కొనుగోలు చేసింది. ఆ తర్వాత  రెండేళ్ల పాటు కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2022లో మెగావేలానికి ముందు రాహుల్‌ త్రిపాఠిని వదిలేసింది. దీంతో వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ రూ. 8.5 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్‌లో రాహుల్‌ త్రిపాఠి అంతంత మాత్రంగానే ఆడాడు. అయితే తనపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ రిటైన్‌ చేసుకుంది. 

తాజాగా తనను వద్దనుకున్న కేకేఆర్‌తో ఇవాళ రాహుల్‌ త్రిపాఠి మ్యాచ్‌ ఆడబోతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ను గెలిపించి ఫామ్‌ మీదున్న రాహుల్‌ త్రిపాఠి తన ప్రతీకారం తీర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారంది. ఇక రాహుల్‌ త్రిపాఠి ఇప్పటివరకు ఐపీఎల్‌లో 79 మ్యాచ్‌లాడి 1906 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 93గా ఉంది. ఇక టీమిండియా తరపున 5 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన రాహుల్‌ త్రిపాఠి 97 పరుగులు చేశాడు.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)